Joe Biden : పాకిస్తాన్ అత్యంత ప్రమాదకరమైన దేశం – బైడెన్
సంచలన కామెంట్స్ చేసిన యుస్ చీఫ్
Joe Biden : అమెరికా దేశ అధ్యక్షుడు జో బైడెన్ సంచలన కామెంట్స్ చేయడం కలకలం రేపింది. ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన దేశాలలో పాకిస్తాన్ టాప్ లో ఉందన్నారు. దానిని నమ్మేందుకు వీలు లేదన్నారు. అమెరికాలోని కాలిఫోర్నియాలోని ఇర్విన్ లో జో బైడెన్ మాట్లాడారు. ప్రపంచం వేగంగా మారుతోందని, ఇది నియంత్రణకు మించినదని పేర్కొన్నారు.
దీనికి ఏ ఒక్క వ్యక్తిని, దేశాన్ని తాను ప్రస్తావించడం లేదన్నారు. రష్యా పదే పదే దాడులు చేస్తానంటోంది. తాము ఆ దేశం గురించి ఆలోచించడం లేదని స్పష్టం చేశారు బైడెన్(Joe Biden). ఉక్రెయిన్ పై దాడులకు దిగడం మంచి పద్దతి కాదని తాము మొదటి నుంచి చెబుతూ వస్తున్నామని అన్నారు.
కానీ రష్యా చీఫ్ పుతిన్ ఏకపక్ష దాడులకు పాల్పడడం మంచి పద్దతి కాదన్నారు. ఓ వైపు దాడులకు దిగుతూ సైనిక చర్య అని పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ తరుణంలో పాకిస్తాన్ స్వతంత్రంగా వ్యవహరించడం లేదని మండిపడ్డారు. ప్రపంచ దేశాలలో పాకిస్తాన్ డేంజర్ గా ఉందన్నారు.
ఎలాంటి సమన్వయం లేకుండా అణ్వాయుధాలు కలిగి ఉందన్నారు. చైనాతో పాకిస్తాన్ అంటకాగడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. జిన్ పింగ్ తో సన్నిహితంగా ఉండే పనిని మాజీ చీఫ్ ఒబామా తనకు అప్పగించారని చెప్పారు బైడెన్. చైనాలో చోటు చేసుకున్న పరిణామాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు.
వ్లాదిమిర్ పుతిన్ వ్యూహాత్మక అణ్వాయుధాన్ని ఉపయోగిస్తే తాము చేతులు కట్టుకుని కూర్చోలేదన్నారు. రష్యాను ఎదుర్కొనేందుకు దాడి చేసేందుకు రెడీగా ఉన్నామని స్పష్టం చేశారు.
Also Read : నాటోకు పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్