PM Pakistan : పాకిస్తాన్ స‌ముద్రంలా క‌నిపిస్తోంది – పీఎం

షెహ‌బాజ్ ష‌రీఫ్ వ‌ర‌ద‌ల తాకిడిపై కామెంట్

PM Pakistan :  గ‌తంలో ఎన్న‌డూ లేని రీతిలో పాకిస్తాన్ దేశాన్ని వ‌ర‌ద‌లు ముంచెత్తాయి. రికార్డు స్థాయిలో వ‌ర్ష‌పాతం న‌మోదైంది. పెద్ద ఎత్తున ప్రాణ న‌ష్టం సంభ‌వించింది.

ప‌లు దేశాలు స‌హాయం చేసే ప‌నిలో ప‌డ్డాయి. ఇప్ప‌టికే ఆర్థిక సంక్షోభంతో కూర‌రుకు పోయిన ఆ దేశాన్ని అకాల వ‌ర్షాలు ముంచెత్తాయి. కోలుకోలేకుండా చేశాయి.

ఈ సంద‌ర్భంగా ఆ దేశ ప్ర‌ధాన‌మంత్రి షెహ‌బాజ్ ష‌రీఫ్(PM Pakistan) తీవ్ర భావోద్వేగానికి గుర‌య్యారు. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు 220 మిలియ‌న్ల మంది జ‌నాభా ఉండ‌గా ఇందులో 33 మిలియ‌న్ల మంది వ‌ర‌ద‌ల ఉధృతికి త‌ల్ల‌డిల్లి పోయారు.

ప‌లు ప్రాంతాల‌లో పీఎం ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా త‌న ఆవేద‌న‌ను పంచుకున్నారు. గ‌త 18 రోజుల నుండి మ‌ర‌ణాలు సంభ‌వించాయి. 1,343 మంది ప్రాణాలు కోల్పోయారు.

వేలాది మంది నిరాశ్ర‌యుల‌య్యారు. క‌నీసం $10 బిలియ‌న్ల న‌ష్టాన్ని క‌లిగించింది ఈ వ‌ర‌ద విపత్తు. ఈ విప‌త్తు సృష్టించిన విల‌యం త‌న‌ను క‌లిచి వేసేలా చేసింద‌న్నారు షెహ‌బాజ్ ష‌రీఫ్.

చూస్తే ఎక్క‌డ చూసినా నీరే ఉంది. ఒక ర‌కంగా ఇది స‌ముద్రాన్ని త‌ల‌పింప చేస్తోంద‌న్నారు. స‌హాయ‌క చ‌ర్య‌లు ముమ్మ‌రం చేశామ‌ని ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు ప్ర‌ధాన మంత్రి.

వ‌ర‌ద బాధితుల‌కు సాయం పెంచామ‌ని, ఇత‌ర ప్రాంతాల‌కు వ‌ల‌స వెళ్లిన వారికి 2,00,000 టెంట్ల‌ను కొనుగోలు చేస్తామ‌న్నారు పీఎం. ఈ విప‌త్తు నుంచి బ‌య‌ట ప‌డాలంటే పెద్ద ఎత్తున సాయం కావాల‌న్నారు.

బాధితుల‌ను ఆదుకునేందుకు ఐక్యరాజ్య స‌మితి 160 మిలియ‌న్ డాల‌ర్ల సాయం అందించాల‌ని కోరారు పీఎం.

Also Read : జ‌ర్న‌లిస్ట్ సిద్దిక్ కు ఉగ్ర‌వాదుల‌తో లింక్

Leave A Reply

Your Email Id will not be published!