Pakistan Media Praises : మోదీ విదేశాంగ విధానం భేష్
పాక్ మీడియాలో హల్ చల్
Pakistan Media Praises : భారత దేశ విదేశాంగ విధానంపై పెద్ద ఎత్తున ప్రశంసలు కురుస్తున్నాయి. ప్రధానంగా దాయాది పాకిస్తాన్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అనుసరిస్తున్న విధానాలు, తీసుకుంటున్న నిర్ణయాలు ప్రభావితం చేస్తున్నాయి. ప్రస్తుతం పాకిస్తాన్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.
మరో వైపు శ్రీలంక తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ తరుణంలో భారత్ పెద్ద ఎత్తున లంకకు మద్దతుగా నిలిచింది. ఇదే సమయంలో నరేంద్ర దామోదర దాస్ మోదీ అద్భుతమైన పాలన సాగిస్తున్నారంటూ పాకిస్తాన్ మీడియా కితాబు(Pakistan Media Praises) ఇస్తోంది. ఆయన పేరు పతాక శీర్షికల్లో ఫస్ట్ ప్లేస్ లో కనిపిస్తోంది.
ఊ అంటే చాలు నిత్యం భారత దేశంపై అవాకులు చెవాకులు పేలుతూ వచ్చే పాకిస్తాన్ ఇప్పుడు తన స్వరం మార్చుకుంది. ప్రధానంగా ప్రపంచ వేదికపై ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందంటూ భారత్ పాకిస్తాన్ పై నిప్పులు చెరిగింది. అంతే కాదు ప్రస్తుతం భారత్ ప్రపంచ మార్కెట్ లో అభివృద్ది చెందుతున్న దేశాలలో ఐదో స్థానంలో కొనసాగుతోంది.
ఇదే సమయంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన జీ20 ప్రపంచ శిఖరాగ్ర గ్రూప్ కు నాయకత్వం వహిస్తోంది భారత్. ఇదే సమయంలో తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న చైనాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇక పాకిస్తాన్ ప్రస్తుతం విదేశీ మారక నిల్వల లేమితో ఇబ్బంది ఎదుర్కొంటోంది.
గోధుమ పిండి కోసం జనం క్యూ కడుతోంది. దీంతో పాక్ మీడియా మోదీ ఆర్థిక విధానాలు, విదేశాంగ విధానాన్ని ప్రశంసిస్తోంది. కాగా మోదీపై పాకిస్తాన్ మీడియా ప్రశంసించడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారారు.
Also Read : రాహుల్ గాంధీ సెక్యూరిటీ అలర్ట్