Miftah Ismail : ఆర్థిక సంక్షోభం అంచున పాకిస్తాన్ – ఇస్మాయిల్
మంత్రి కామెంట్స్ కలకలం
Miftah Ismail : నిన్న శ్రీలంక సంక్షోభంతో తల్లడిల్లితే ఇవాళ పాకిస్తాన్ లో కూడా సేమ్ సీన్ రిపీట్ కాబోతోందంటూ ఆ దేశ ఆర్థిక మంత్రి మిఫ్తా ఇస్మాయిల్ హెచ్చరించాడు.
దీంతో ఎప్పుడైనా ఆర్థిక సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందంటూ పేర్కొన్నాడు. దేశ ప్రజలు అందుకు సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చాడు.
పదవీచ్యుతుడైన ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాలనో ఆర్థిక విధానాల కారణంగా దేశం ఇవాళ సంక్షోభం లోకి నెట్టి వేయ బడిందంటూ సంచలన ఆరోపణలు చేశారు.
మిఫ్తా ఇస్మాయిల్(Miftah Ismail) శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఇక రానున్న రోజులన్నీ గడ్డు రోజులంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పుడు అప్పుల కుప్పగా మారిన దేశాన్ని తాము ఏమీ చేయలేమన్నారు.
ఒక రకంగా చేతులెత్తేసినట్లు మాట్లాడటం ఒకింత ఆందోళన కలిగిస్తోంది. ఇదే క్రమంలో బెయిలౌట్ ను త్వరగా పునరుద్దరించాలని పాకిస్తాన్ కోరింది. కానీ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్ ) వాయిదాను విడుదల చేయలేదు.
తీవ్ర నగదు కొరతతో సతమతం అవుతోంది పాకిస్తాన్. వచ్చే మూడు నెలల పాటు ప్రభుత్వం దిగుమతులను అరికట్టడాన్ని కొనసాగిస్తుందని ప్రకటంచారు ఆర్థిక మంత్రి మిఫ్తా ఇస్మాయిల్.
దేశం లోటు బడ్జెట్ 1,600 బిలియన్లు కాగా గత నాలుగేళ్ల ఇమ్రాన్ పాలనలో అది 3,500 బిలియన్లకు పెరిగిందని ఆరోపించారు. ఈ రకమైన కరెంట్ ఖాతా లోటుతో ఏ దేశమూ అభివృద్ది చెందదన్నారు.
దిగుమతులను అనుమతించమని దీని వల్ల కొంత మేలు జరుగుతుందని అనుకుంటన్నట్లు తెలిపారు ఆర్థిక మంత్రి. ఇదిలా ఉండగా మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
Also Read : కాబూల్ లో ‘వియాన్’ పాక్ జర్నలిస్ట్ కిడ్నాప్