Pakistan PM : జిన్ పింగ్ నిజ‌మైన స్నేహితుడు – పీఎం

మూడోసారి ఎన్నికైన ప్రెసిడెంట్ కు కంగ్రాట్స్

Pakistan PM : డ్రాగ‌న్ చైనా దేశానికి అధ్య‌క్షుడిగా వ‌రుస‌గా మూడోసారి జిన్ పింగ్ ఎన్నిక‌య్యారు. క‌మ్యూనిస్టు పార్టీ కీల‌క స‌మావేశంలో ఏక‌గ్రీవంగా జిన్ పింగ్ కు మ‌రోసారి అవ‌కాశం ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా చైనా చీఫ్ గా ఎన్నికైన జిన్ పింగ్ కు ప్రపంచ వ్యాప్తంగా అభినంద‌న‌లు వెల్లువెత్తాయి.

గ‌త కొంత కాలం నుంచీ దాయాది పాకిస్తాన్ కు చైనా స‌పోర్ట్ గా ఉంటూ వ‌స్తోంది. మ‌రో వైపు భార‌త్ తో క‌య్యానికి కాలు దువ్వుతోంది. ఈ త‌రుణంలో పాకిస్తాన్ ప్ర‌ధాన మంత్రి షెహ‌బాజ్ ష‌రీఫ్(Pakistan PM) కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. పాకిస్తాన్ కు జిన్ పింగ్ నిజ‌మైన స్నేహితుడంటూ కితాబు ఇచ్చారు. ప్ర‌శంశ‌ల‌తో ముంచెత్తారు.

ఇదిలా ఉండగా చైనాలో విప్ల‌వ‌కారుడు మావో జెడాంగ్ త‌ర్వాత సుదీర్ఘ కాలం పాటు అధ్య‌క్షుడిగా కొలువు తీరిన నాయ‌కుడిగా జిన్ పింగ్ చ‌రిత్ర సృష్టించారు. ఇదిలా ఉండ‌గా దేశానికి అధ్య‌క్షుడిగా మాత్ర‌మే కాదు చైనా సెంట్ర‌ల్ మిలిట‌రీ క‌మిష‌న్ చీఫ్ గా కొన‌సాగుతారు జిన్ పింగ్.

చైనా ప్ర‌జ‌ల ప‌ట్ల జిన్ పింగ్ కు ఉన్న అచంచ‌ల‌మైన భ‌క్తికి గుర్తుగా ఆయ‌న‌ను మూడోసారి ప్రెసిడెంట గా ఎన్నుకున్నారంటూ పేర్కొన్నారు షెహ‌బాజ్ ష‌రీఫ్‌. సీపీసీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీగా మూడోసారి తిరిగి ఎన్నికైనందుకు మొత్తం పాకిస్తాన్ దేశం త‌ర‌పున జిన్ పింగ్ ను అభినందిస్తున్నాన‌ని తెలిపారు పీఎం.

చైనా ప్ర‌జ‌ల‌కు విశిష్ట సేవ‌లు అందిస్తున్నందుకు ఆయ‌న‌కు ద‌క్కిన అరుదైన బ‌హుమ‌తి అని కొనియాడారు.

Also Read : చైనా ప్రెసిడెంట్ గా జిన్ పింగ్ ఎన్నిక

Leave A Reply

Your Email Id will not be published!