Pakistan Supreme Court : పాకిస్తాన్ లో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ సంక్షోభంపై ఆ దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీంకోర్టు(Pakistan Supreme Court )ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదని పేర్కొన్నారు.
ఈ మేరకు ప్రస్తుత సంక్షోభంపై సహేతుకమైన ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు పాకిస్తాన్ ప్రధాన న్యాయమూర్తి ఉమర్ అటా బండియల్. ప్రస్తుత పరిస్థితి చట్ట బద్దతను కోర్టు పరిగణలోకి తీసుకుంటుందన్నారు.
అనంతరం సాధ్యా సాధ్యాలను, చోటు చేసుకున్న పరిణామాలను పరిగణలోకి తీసుకుని అంతా ఆలోచించాక ఒక స్పష్టమైన ఉత్తర్వు వెలువరిస్తామని స్పష్టం చేశారు.
అంతకు ముందు ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ అవిశ్వాస తీర్మానాన్ని నేషనల్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఖాసిం నూరి కొట్టి వేశారు. అంతే కాకుండా స్థానిక పార్లమెంట్ ను రద్దు చేయడంపై సుప్రీంకోర్టు(Pakistan Supreme Court )సోమవారం సుమోటో నోటీసుపై విచారణను ప్రారంభించింది.
ఈ తరుణంలో ఈనెల 5న పీటీఐ పార్లమెంటరీ బోర్డు సమావేశం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు ఆ పార్టీ చీఫ్ పీఎం ఇమ్రాన్ ఖాన్. తదుపరి ఎన్నికల కోసం టికెట్ల పంపిణీ, తదితర అంశాల గురించి జరిగే ఈ మీటింగ్ కు ఖాన్ అధ్యక్షత వహించనున్నారు.
ఇదిలా ఉండగా సీజేపీ , జస్టిస్ ఇజాజుల్ అహ్సన్ , జస్టిస్ మజర్ ఆలం ఖాన్ మియాంఖేల్ , జస్టిస్ మునీబ్ అక్తర్ , జస్టిస్ జమాల్ ఖాన్ మండోఖైల్ లతో కూడిన బెంచ్ ఈ కేసును విచారిస్తోంది.
Also Read : శ్రీలంక ప్రధాని మహింద రాజపక్స రిజైన్