Paleru Congress Ticket : పాలేరుపై తెగని పంచాయతీ
పొంగులేటి వర్సెస్ తుమ్మల
Paleru Congress Ticket : హైదరాబాద్ – తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో టికెట్ల పంచాయతీ మరింత ముదిరి పాకాన పడుతోంది. నువ్వా నేనా అన్న రీతిలో పోటీ నెలకొంది. ఒక్కో సీటుకు పెద్ద ఎత్తున పోటీ నెలకొంది. ఆశావహులు ఎక్కువ కావడంతో పార్టీ హైకమాండ్ సీట్లకు సంబంధించి ఖరారు చేసే పనిలో పడింది. ఇదిలా ఉండగా ఇటీవలే భారత రాష్ట్ర సమితి పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు.
Paleru Congress Ticket War Continuous
ఈ ఇద్దరూ తల పండిన నేతలు కావడం విశేషం. ఇదే ఖమ్మం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నేతలలో మల్లు భట్టి విక్రమార్కతో పాటు పొంగులేటి, తుమ్మల కూడా ఉన్నారు. తాజాగా వామపక్షాలు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నాయి. దీంతో పార్టీ పరంగా తెలంగాణలో సీపీఐ, సీపీఎం పార్టీలకు రెండు సీట్ల చొప్పున కేటాయించింది కాంగ్రెస్ హైకమాండ్.
దీంతో ఖమ్మం జిల్లాలో కీలకమైన స్థానం కొత్తగూడెం వామపక్షాలకు వెళ్లడంతో మిగిలింది పాలేరు(Palair) నియోజకవర్గం. దీనిపై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరో వైపు తుమ్మల నాగేశ్వర్ రావు ఆశిస్తున్నారు. ఇరువురు కీలకమైన నేతలు కావడంతో మీరే తేల్చుకోండి అంటూ పార్టీ హైకమాండ్ తేల్చి చెప్పింది.
Also Read : BRS Party Slams : రేవంత్ తెలంగాణ ద్రోహి