Panchakarla Ramesh Babu : సైనికుడిలా పని చేస్తా – రమేష్ బాబు
20న జనసేనలో చేరుతానని ప్రకటన
Panchakarla Ramesh Babu : వైఎస్సార్ సీపీ విశాఖ జిల్లా మాజీ చీఫ్ , మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మర్యాద పూర్వకంగా జనసే పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ ను ఆదివారం కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను అభినందించారు పవర్ స్టార్. ఈనెల 20న జనసేన పార్టీలో అధికారికంగా చేరుతానని స్పష్టం చేశారు. తన అనుచరులతో వచ్చిన పంచకర్ల రమేష్ బాబు(Panchakarla Ramesh Babu) వారిని పవన్ కళ్యాణ్ కు పరిచయం చేశారు.
ఇదిలా ఉండగా మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో కీలక సమావేశం జరిగింది. ఈ కీలక భేటీలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. అనంతర పంచకర్ల రమేష్ బాబు మీడియాతో మాట్లాడారు. జనసేన పార్టీ భావ జాలం , రాష్ట్ర శ్రేయస్సు కోసం పవన్ కళ్యాణ్ పడుతున్న తపన చూసి తాను పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.
ఇదే విషయం ఆయనతో చెప్పానని అన్నారు. తన పార్టీ అనుచరులు సైతం జనసేన వైపు మొగ్గు చూపారని పేర్కొన్నారు. పార్టీ అభివృద్ది కోసం పని చేస్తానని చెప్పారు. జనసేన పార్టీ చీఫ్ ఎలాంటి బాధ్యతలు అప్పగించినా తాను వంద శాతం కష్ట పడతానని స్పష్టం చేశారు పంచకర్ల రమేష్ బాబు.
అధికార వైసీపీ అరాచకాలను చూసి తట్టుకోలేక తాను బయటకు వచ్చానని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక నుంచి ప్రజల తరపున తన వాయిస్ వినిపిస్తానని ప్రకటించారు పంచకర్ల రమేష్ బాబు.
Also Read : RS Praveen Kumar : బీఆర్ఎస్ లో కమీషన్లు..కబ్జాలు – ఆర్ఎస్పీ