Panchamasali’ s Rally : రిజ‌ర్వేష‌న్ల‌పై పంచ‌మసాలీలు డిమాండ్

క‌ర్ణాట‌క లింగాయ‌త్ లో బ‌ల‌మైన వ‌ర్గం

Panchamasali’ s Rally : క‌ర్ణాట‌క ప్ర‌భ‌త్వంపై పంచ‌మ‌సాలీలు ఒత్తిడి పెంచేందుకు సిద్దం అవుతున్నారు. ఇప్ప‌టికే ఎన్నిక‌ల సంద‌ర్భంగా, చాలా స‌మ‌యాల‌లో పంచ‌మ‌సాలీల‌కు రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిస్తామ‌ని బీజేపీ ప్ర‌క‌టించింది.

ఈ పంచ‌మ‌సాలీలు అత్య‌ధిక జ‌నాభా క‌లిగి ఉన్నారు. రేపు రాబోయే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కీల‌క పాత్ర పోషించే అవ‌కాశం ఉంది. దీంతో అన్ని పార్టీలు వీరిని ప్ర‌స‌న్నం చేసుకునేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

ఇదే స‌మ‌యంలో క‌న్న‌డ నాట లింగాయ‌త్ ల క‌మ్యూనిటీ బిగ్. వారిని కాద‌న‌కుండా ఏ ప్ర‌భుత్వం న‌డ‌ప లేదు. అంత‌టి ప్ర‌భావంత‌మైన వ‌ర్గంగా ఉంది. ఇదిలా ఉండ‌గా ఈ లింగాయ‌త్ లో పంచమ‌సాలీల(Panchamasali’ s Rally)  ప్రాతినిధ్యం ఎక్కువ‌గా ఉంటుంది.

దీంతో త‌మ‌కు ప్ర‌త్యేకంగా రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాల‌ని కోరుతున్నారు. ఈ మేర‌కు ఇప్ప‌టి వ‌ర‌కు రిజ‌ర్వేష‌న్ల క‌ల్పించ‌క పోవ‌డాన్ని త‌ప్పు ప‌డుతున్నారు. ఇందులో భాగంగా ఒత్తిళ్లు తీసుకు రావాల‌ని నిర్ణ‌యించింది.

క‌ర్ణాట‌క వెనుక‌బ‌డిన జాబితా లోని 2ఎ కేట‌గిరీలో చేర్చాల‌ని పంచ‌మ‌సాలి (లింగాయ‌త్ ) సామాజిక వ‌ర్గ స‌భ్యులు డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ ప్ర‌భుత్వం మెరుగైన రిజ‌ర్వేష‌న్ అవకాశాలు క‌ల్పిస్తామ‌న్న హామీని గుర్తు చేశారు.

కూడ‌ల సంగ‌మ కు చెందిన పంచ‌మ‌సాలీ మ‌ఠాధితి జ‌గ‌ద్గురు బ‌స‌వ జ‌య మృత్యుంజ‌య స్వామి తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ధ‌ర‌వాడ జిల్లాలో పాద‌యాత్ర చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించామ‌న్నారు స్వామి. బీజేపీ ప్ర‌భుత్వం మూడు సార్లు హామీ ఇచ్చింది.

కానీ ఇప్ప‌టి వ‌ర‌కు నెర‌వేర్చ‌లేద‌ని మండిప‌డ్డారు. సీఎం త‌న మాట‌కు క‌ట్టుబ‌డి ఉంటాన‌ని అన్నారు. ఆయ‌న‌కు మ‌రోసారి గుర్తు చేసేందుకు జూలై 30న నెహ్రూ మైదానం నుంచి ధార్వాడ వ‌ర‌కు పాద‌యాత్ర చేప‌డ‌తామ‌న్నారు.

Also Read : క‌ర్ణాట‌క ప్ర‌భుత్వ వార్షికోత్స‌వ వేడుక‌లు ర‌ద్దు

Leave A Reply

Your Email Id will not be published!