Paravastu Chinnaya Suri: ప్రముఖ తెలుగు కవి
తెలుగు మరియు సంస్కృత వ్యాకరణం మరియు సాహిత్యం లో గొప్ప ధీశాలి.
పరవస్తు చిన్నయ సూరి
Paravastu Chinnaya Suri : పరవస్తు చిన్నయ సూరి (1809-1861): తమిళనాడులోని చెంగల్‌పట్టు జిల్లా పెరంబుదూరులో జన్మించిన పరవస్తు చిన్నయ సూరి జీవితాంతం తెలుగు భాషాభ్యుదయానికి, తెలుగు సాహిత్యానికి ఎనలేని కృషి చేసారు. తెలుగు మరియు సంస్కృత వ్యాకరణం మరియు సాహిత్యం లో గొప్ప ధీశాలి. “పద్యమునకు నన్నయ… గద్యమునకు చిన్నయ” అనే లోకోక్తి కూడా ఉంది. చిన్నయ వైష్ణవ సంప్రదాయంలోని సాతానుల కుటుంబం లో జన్మించినప్పటికీ బ్రాహ్మణ ఆచారవ్యవహారాలు పాటించేవారు.
Paravastu Chinnaya Suri – చిన్నయ ఉద్యోగ, రచనా ప్రస్థానం
మద్రాసు ప్రభుత్వ (పచ్చాయప్ప) కళాశాలలో తెలుగు బోధకుడిగా ఉద్యోగంలో చేరిన చిన్నయ… జీవితాంతం తెలుగు భాషాభ్యుదయానికి, తెలుగు సాహిత్యానికి ఎనలేని కృషి చేసారు. దీనితో అప్పటి విశ్వవిద్యాలయ కార్యదర్శి ఎ. జె. ఆర్బత్నాట్ కాశీ నుండి తర్కమీమాంస పండితులను చేత చిన్నయను పరీక్ష చేయించి, సమర్థుడని గుర్తించి, “చిన్నయసూరి(Paravastu Chinnaya Suri)” అనే అక్షరాలతో స్వర్ణకంకణాన్నిబహుమతిగా ఇచ్చాడు. అప్పటినుండి పరవస్తు చిన్నయ కాస్తా పరవస్తు చిన్నయసూరి గా గుర్తింపు పొందారు. చిన్నయసూరి రచనల్లో “నీతి చంద్రిక” పేరుతొ రచించిన మిత్ర లాభం, మిత్ర భేదం, సంధి, విగ్రహం అనే గ్రంధాలూ తెలుగు వాచకాల్లో మొదటి తరగతి నుండి యునివర్సిటీ స్థాయి వరకు నేటికీ ముఖ్య పాఠాలుగా కొనసాగుతున్నాయి. ఆ తరువాత “శబ్ద లక్షణ సంగ్రహం” అనే వ్యాకరణ గ్రంధం, “నీతి సంగ్రహం” అనే పద్య సంకలనం, “బాల వ్యాకరణం” వ్యాకరణ గ్రంధాన్ని రచించి ముద్రించాడు. అంతేకాదు బ్రిటీషు వారి ఆదేశాల మేరకు “The Manual of Hindu Law ” అనే న్యాయ శాస్త్ర గ్రంధాన్ని “హిందూ ధర్మ శాస్త్ర సంగ్రహం” అనే పేరుతొ తెలుగు లోకి అనువాదం చేసాడు.
Also Read : Tripuraneni Gopichand: సంపూర్ణ మానవతావాది