Tripuraneni Gopichand: సంపూర్ణ మానవతావాది

తొలి తెలుగు మనో వైజ్ఞానిక సాహితీవేత్త త్రిపురనేని గోపీచంద్

త్రిపురనేని గోపీచంద్

Tripuraneni Gopichand: త్రిపురనేని గోపీచంద్ (సెప్టెంబర్ 8, 1910 – నవంబర్ 2, 1962): తెలుగు రచయిత, హేతువాది, మనో వైజ్ఞానిక సాహితీవేత్త, తెలుగు సినిమా దర్శకుడిగా గుర్తింపు పొందిన త్రిపురనేని గోపీచంద్ కృష్ణా జిల్లా అంగలూరు గ్రామములో జన్మించారు. గోపీచంద్ తండ్రి ప్రముఖ రచయిత, హేతువాది, సంఘ సంస్కర్త అయిన త్రిపురనేని రామస్వామి. గోపీచంద్ ఆరుగురి సంతానంలో ఆఖరి కుమారుడు త్రిపురనేని సాయిచంద్ ప్రస్తుతం సినీ నటుడిగా, దర్శకుడిగా కొనసాగుతున్నారు.

Tripuraneni Gopichand – గోపీచంద్ రచనా ప్రస్థానం

హేతువాద నాస్తికత్వపు భావజాలాల వాతావరణంలో పెరిగిన గోపీచంద్ నవలలో మార్క్సిస్టు భావాలు కనిపిస్తాయి. మార్కిజాన్నిఅధ్యయనం చేసిన గోపీచంద్ బీదవాళ్ళాంతా ఒక్కటే, గోడమీద మూడోవాడు, పిరికివాడు, మార్కిజం అంటే ఏమిటి?, పట్టాభి గారి సోషలిజం, సోషలిజం ఉద్యమ చరిత్ర వంటి కథలు గ్రంధాలు రాసారు. తరువాత మార్కిజంలో లోటుపాటులు గ్రహించి ఎం.ఎన్. రాయ్ గారి నవ్య మానవ వాదం వైపు పయనించారు. రాడికల్ డెమక్రటిక్ పార్టీ కార్యదర్శిగా పార్టీ రహిత నవ్య మానవ సమాజం నిర్మాణం వైపుగా భావ విప్లవం కొరకు సాహిత్య కృషి చేసారు.

గోపీచంద్(Tripuraneni Gopichand) నెమ్మదిగా నాస్తిక సిద్ధాంతం నుండి బయటపడి, చివరి రోజులలో తత్వవేత్తలు అనే తాత్విక గ్రంథాన్ని వ్రాయటం రాసారు. 1928లోనే శంబుక వధ కథ ద్వారా సాహిత్యరంగంలోకి ప్రవేశించిన గోపీచంద్ 1938లో పట్టాభి గారి సోషలిజం అన్న పుస్తకాన్ని వెలువరించాడు. ఆయన రచనల్లో అసమర్ధుని జీవయాత్ర, పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా, గడియపడని తలుపులు, చీకటి గదులు మొదలైనవి పేరు గాంచాయి. ఆయన వ్రాసిన అసమర్థుని జీవయాత్ర తెలుగులో మొదటి మనో వైజ్ఞానిక నవల. 1963లో పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామాకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది.

సినిమా రంగంలో గోపీచంద్ పాత్ర

1939లో చలనచిత్ర రంగంలోకి ప్రవేశించిన గోపీచంద్ చదువుకున్న అమ్మాయిలు, ధర్మదేవత, రైతుబిడ్డ మొదలైన చిత్రాలకు మాటలు రాశాడు. ప్రియురాలు, పేరంటాలు, లక్ష్మమ్మ మొదలైన చిత్రాలకు దర్శకనిర్మాతగా మారాడు. అయితే వాటివల్ల ఆర్థికంగా చాలా నష్టపోయారు.

Also Read : Viswanatha Satyanarayana: “కవి సమ్రాట్” తొలి తెలుగు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత

Leave A Reply

Your Email Id will not be published!