Amit Shah:అదుపుతప్పిన అమిత్‌ షా హెలికాప్టర్‌ ! తప్పిన పెను ప్రమాదం !

అదుపుతప్పిన అమిత్‌ షా హెలికాప్టర్‌ ! తప్పిన పెను ప్రమాదం !

Amit Shah:కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్‌ షాకు పెను ప్రమాదం తప్పింది. అమిత్ షా ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ టేకాఫ్‌ అవుతుండగా అదుపుతప్పి నియంత్రణ కోల్పోయింది. బిహార్‌ లోని బెగుసరాయ్‌లో ఎన్నికల ప్రచారం ముగించుకుని తిరుగు ప్రయాణం అవుతుండగా సోమవారం ఈ ఘటన జరిగింది. అమిత్ షా హెలికాప్టర్ అదుపుతప్పిన వీడియోను డాక్టర్ అభిషేక్ వర్మ తన సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్ లో పోస్ట్ చేసారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

Amit Shah:

బీహార్ లోని బెగుసరాయ్ లో ఎన్నికల ప్రచారం ముగించుకుని అమిత్‌ షా హెలికాప్టర్‌ ఎక్కారు. హెలికాప్టర్‌ గాల్లోకి లేచే సమయంలో ఊగిసలాడి కుడివైపుకు వెళ్లింది. ఒక దశలో కిందకు వచ్చి నేలను తాకే దాకా వెళ్లింది. ఇంతలో అప్రమత్తమైన పైలట్‌ హెలికాప్టర్‌ ను నియంత్రణలోకి తీసుకోవడంతో సరైన దిశలో ప్రయాణించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ గా మారింది. థ్యాక్స్ గాడ్ అంటూ బీజేపీ నాయకులు, అమిత్ షా అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

Also Read :-BJP 7th List : తండ్రి స్థానంలో తనయుడికి టికెట్ కన్ఫర్మ్ చేసిన అధిష్టానం

Leave A Reply

Your Email Id will not be published!