Telangana Election Comment : తెలంగాణం త‌ల‌వంచ‌ని ధీర‌త్వం

రేవంత్ రెడ్డి చంద్ర‌బాబు జ‌పం

Telangana Election Comment : ఈ దేశంలో సుదీర్ఘ‌మైన రాజ‌కీయ ఉద్య‌మ చ‌రిత్ర క‌లిగిన ఏకైక ప్రాంతం తెలంగాణం. ఇది నినాద‌మే కాదు నాలుగున్న‌ర కోట్ల ఆర్త‌నాదం. బ‌లిదానాలు, ఆత్మ‌హ‌త్యలు, త్యాగాలు, ఎన్ కౌంట‌ర్ల‌కు గురై, అనేక అవ‌మానాలు భ‌రించి కోరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం మ‌రోసారి చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఎదుర్కొన్న ఛీత్కారాలు అన్నీ ఇన్నీ కాదు. యాస మీద‌, భాష మీద‌, చివ‌ర‌కు సంస్కృతి మీద కూడా ముప్పేట దాడికి గురైంది. ఎప్పుడైతే తెలంగాణ(Telangana) ఏర్ప‌డిందో ఆనాటి నుంచి సీన్ మారింది. అన్ని రంగాలు తెలంగాణ జ‌పం చేస్తున్నాయి. దీనికి కార‌ణం సాంస్కృతిక ప‌రంగా కీల‌క‌మైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఇవాళ బ‌తుక‌మ్మ ఒక్క తెలంగాణ‌కే కాదు దేశ వ్యాప్తంగా ఆక్టోప‌స్ లా విస్త‌రించింది. కోట్లాది మంది ఆడ‌బిడ్డ‌లే కాదు పురుషులు సైతం బ‌తుక‌మ్మ‌ను గౌర‌విస్తున్నారు. ఆడుతున్నారు. చివ‌ర‌కు సుదీర్ఘ చ‌రిత్ర క‌లిగిన‌, ఆత్మ బ‌లిదానం సాక్షిగా ఏర్ప‌డిన బ‌తుక‌మ్మ‌ను సైతం వ్యాపారంగా మార్చేశారు.

Telangana Election Comment Viral

మ‌ళ్లీ సీమాంధ్ర‌లు ఒక్క‌టవుతున్నారు. ఎలాగైనా స‌రే తెలంగాణ‌ను త‌మ గుప్పిట్లోకి తెచ్చు కోవాల‌ని ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇది రాను రాను ఆందోళ‌న క‌లిగించే అంశం. తెలంగాణ సిద్దాంత‌క‌ర్త‌, దివంగ‌త వీసీ జ‌య‌శంక‌ర్ ఆచారి చెప్పింది ఒక్క‌టే. తెలంగాణ(Telangana) ఏర్ప‌డ‌టం ముఖ్యం. కానీ రాష్ట్రం వ‌చ్చాక దానిని కాపాడు కోవ‌డం అత్యంత ముఖ్య‌మ‌ని, దీనిని కాపాడు కోవాల్సిన బాధ్య‌త ప్ర‌తి తెలంగాణ‌లో జీవిస్తున్న వారంద‌రిపై ఉంటుంద‌ని హెచ్చ‌రించారు. తెలంగాణ పేరుతో కొలువు తీరిన బీఆర్ఎస్ స‌ర్కార్ నీళ్లు, నిధులు, నియామ‌కాల ట్యాగ్ లైన్ ను మ‌రిచి పోయింది. సంక్షేమ ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాల పేరుతో జ‌నం చెవుల్లో పూలు పెట్టింది. ఇదే తెలంగాణ పేరును ఆస‌రాగా చేసుకుని క‌బ్జాలు, దౌర్జ‌న్యాలు, దోపిడీ, అక్ర‌మాల‌కు పాల్ప‌డింది. ఎక్క‌డ చూసినా క‌బ్జాలే త‌ప్ప ఆదుకున్న దాఖ‌లాలు లేవు. ఒక‌రకంగా చెప్పాలంటే ఆనాటి ర‌జాక‌ర్ల పాల‌న‌ను గుర్తుకు తీసుకు వ‌చ్చేలా చేశారు న‌యా నిజాం న‌వాబు సీఎం కేసీఆర్.

ఈ స‌మ‌యంలో ప్ర‌స్తుతం జ‌రుగుతున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తెలంగాణ నినాదం, సీమాంధ్రుల వాదం ప్ర‌ధానంగా ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చాయి. ఇవే ఎన్నిక‌ల నినాదాలుగా మారాయి. ఇది విచిత్రం. ప్ర‌స్తుతం స‌ర్కార్ ప‌ట్ల ఉన్న వ్య‌తిరేక‌త రోజు రోజుకు పెరుగుతోంది. దీనిని ఆస‌రాగా చేసుకున్న కాంగ్రెస్ పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డి ప‌దే ప‌దే మాజీ సీఎం చంద్ర‌బాబు నాయుడును ప్ర‌స్తావిస్తూ వ‌స్తున్నారు. అంతులేని అవినీతికి కేరాఫ్ గా మారిన బాబు అవ‌స‌రం తెలంగాణ‌కు ఏముంద‌ని తెలుసుకోవాలి. రేవంత్ తెలంగాణ వాడైనా నర‌న‌రాన తెలుగుదేశం (క‌మ్మ‌) భావ‌జాలంతో నిండి పోయిన వ్య‌క్తి. ఇక‌నైనా కాంగ్రెస్ పార్టీ పున‌రాలోచించాలి. ప్ర‌త్యేకించి తెలంగాణ ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌గా ఉండాలి. లేక పోతే మ‌రోసారి సీమాంధ్రుల చేతుల్లోకి వెళ్ల‌డం ఖాయం.

Also Read : Revanth Reddy : క్రిష్టియ‌న్ల సంక్షేమం కాంగ్రెస్ ల‌క్ష్యం

Leave A Reply

Your Email Id will not be published!