YS Jagan Mohan Reddy: దేశం ఆశ్చర్యపోయేలా మన విజయం ఉండబోతుంది – సీఎం జగన్
దేశం ఆశ్చర్యపోయేలా మన విజయం ఉండబోతుంది - సీఎం జగన్
YS Jagan Mohan Reddy: ఏపీ ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) తొలిసారి స్పందించారు. ‘‘ఏపీలో వచ్చే ఫలితాలను చూసి దేశం మొత్తం ఆంధ్రావైపే చూస్తుంది. గతంలో 151 అనేదే చాలా పెద్ద నెంబర్… 22 ఎంపీ స్ధానాలు కూడా చాలా పెద్ద సంఖ్యే… ఈసారి 151 కంటే ఎక్కువ స్ధానాలు, 22 ఎంపీ స్ధానాలు కంటే ఎక్కువ స్థానానలు మనం సాధిస్తాం’’ అని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. గురువారం విజయవాడలోని బెంజి సర్కిల్ వద్ద ఉన్న ఐప్యాక్ ఆఫీసుకు వెళ్లిన సీఎం జగన్… ఐప్యాక్ టీం సభ్యులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఐ ప్యాక్ టీం సభ్యలను పేరుపేరుగా పలకరిస్తూ… ఎన్నికల్లో వారి కష్టపడిన తీరును అభినందించారు. దీనితో సీఎం సీఎం అంటూ ఐ ప్యాక్ సభ్యులు నినాదాలు చేసారు.
YS Jagan Mohan Reddy Comment
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ… ‘‘మీరు ఏడాదిన్నరగా అద్భుతంగా పనిచేశారు. మీ కృషి వల్లే టార్గెట్ ను సాధించగలుగుతున్నాం. రిషీ చేసిన ఎఫర్ట్ కూడా చాలా గొప్పది. చాలా మందికి ప్రశాంత్ కిషోర్ ఏం చేస్తున్నారో తెలియడం లేదు. ప్రశాంత్ కిషోర్ కన్నా రిషీ టీం చాలా వర్తీ. ఏపీ రిజల్ట్స్ దేశంలోని ప్రతీ ఒక్కరిని ఆశ్చర్యపరుస్తాయి. జూన్ 4న వచ్చే నెంబర్లు గతంలో ప్రశాంత్ సాధించిన వాటికన్నా గొప్పగా వస్తాయి. ఎన్నికల తరువాత కూడా మీ టీం సేవలు కొనసాగించండి’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. సీఎం జగన్‌తో పాటు మంత్రులు బొత్సా సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నందిగం సురేష్, శ్రీకాంత్ రెడ్డిలు ఉన్నారు. ఇది ఇలా ఉండగా ఏపీ ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన ఫస్ట్ రియాక్షన్ రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. ఇప్పటివరకు టైట్ ఫైట్, ఎవరికి ఎడ్జ్ తెలియదన్నట్టుగా జరుగుతున్న ప్రచారానికి… సీఎం జగన్ చేసిన ప్రకటన చెక్ పెట్టింది.
Also Read : Telangana Vice Chancellors: కొత్త వీసీల నియామకాలకు తెలంగాణా ప్రభుత్వం కసరత్తు !