Vijayendra Saraswathi : పారాయణం విలువలకు సోపానం
కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి
Vijayendra Saraswathi : రామాయణం, మహా భారతం లాంటి ఇతిహాసాల పారాయణం వల్ల సమాజంలో ధార్మిక విలువలు పెంపొందుతాయని సెలవిచ్చారు కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి మహాస్వామి. ఇలాంటి మంచి కార్యక్రమాలను చేపడుతూ వస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానంను అభినందిస్తున్నట్లు తెలిపారు. ప్రధానంగా ఈవో ధర్మారెడ్డి ధార్మికుడని పేర్కొన్నారు. తిరుమల నాద నీరాజనం వేదికపై అయోధ్యకాండ పారాయణం జరిగింది. శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి వారితో పాటు ఈవో ధర్మారెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడారు. ఇతిహాసాలు మానవ జాతి ధర్మ బద్దమైన జీవితాన్ని గడిపేందుకు దోహద పడేలా చేస్తాయని చెప్పారు. కరోనా మహమ్మారి నుండి మానవాళిని రక్షించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ పారాయణ యజ్ఞాన్ని గత మూడేళ్లుగా టీటీడీ విజయవంతంగా నిర్వహిస్తోందని కితాబు ఇచ్చారు. పారాయణాల ద్వారా ఇతిహాసాల సారాన్ని ప్రపంచానికి అందించాలని ఈవో ధర్మారెడ్డి చేస్తున్న కృషిని కొనియాడారు శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి.
ఏళ్లు గడిచినా తరాలు మారినా ఇతిహాసాలు మారవన్నారు. నేటికీ రామాయణంలోని పాత్రలు ఆదర్శనీయంగా నిలుస్తాయన్నారు. తండ్రి ప్రేమకు చిహ్నంగా దశరథుడు, తండ్రి మాటను జవదాటని తనయుడిగా శ్రీరాముడు, బాధ్యతాయుతమైన సతీమణిగా సీత, చెక్కు చెదరని సోదర ప్రేమకు గుర్తుగా లక్ష్మణుడు, భరతుడు , నమ్మకమైన బంటు, సేవకుడిగా హన్మంతుడి పాత్రలు చిరస్మరణీయంగా ఉండి పోతాయని శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి పేర్కొన్నారు.
Also Read : Shikar Dhawan Catch