Paritala Sriram : గద్దరన్న బతికే ఉంటాడు – శ్రీరామ్
ఆవేదన వ్యక్తం చేసిన పరిటాల
Paritala Sriram : ప్రజా వాగ్గేయకారుడు గద్దరన్నకు మరణం లేదన్నారు టీడీపీ సీనియర్ నాయకుడు పరిటాల శ్రీరామ్(Paritala Sriram). తమ కుటుంబంతో ఆయనకు 40 ఏళ్ల అనుబంధం ఉందని చెప్పారు. లాల్ బహదూర్ స్టేడియంలో గద్దర్ భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. పుష్ప గుచ్చం ఉంచారు. కుటుంబాన్ని పరామర్శించారు. తెలంగాణ ప్రాంతానికే కాదు గద్దరన్న అందరికీ , అన్ని ప్రాంతాల వారికీ చెందిన అరుదైన గాయకుడని కొనియాడారు పరిటాల శ్రీరామ్.
Paritala Sriram Paid Tributes to Gaddar
సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మా చిన్నాన్న ఎన్ కౌంటర్ జరిగిన సమయంలో , మా తండ్రిని చంపినప్పుడు ఇలా ప్రతి సందర్భం లోనూ గద్దరన్న తమకు వెన్ను దన్నుగా నిలిచాడని కన్నీటి పర్యంతం అయ్యారు పరిటాల శ్రీరామ్.
గద్దరన్న పాడిన పాటలు రాయలసీమ ప్రాంతాన్ని ఇప్పటికీ కదిలిస్తూనే ఉన్నాయని, ఆయన పాడిన పాటలు ప్రజల నాలుకల మీద నర్తిస్తూనే ఉన్నాయని కొనియాడారు. ఆయన గొంతు అగ్గిగళం అంటూ పేర్కొన్నారు పరిటాల శ్రీరామ్.
ఈ ప్రపంచంలో గద్దర్ లాంటి గాయకులు కొందరు మాత్రమే ఉంటారని, ప్రత్యేకించి శరీరంలో తూటాను పెట్టుకుని పాటలు పాడిన ఏకైక సింగర్ ఆయన ఒక్కరేనని ఇంతకంటే ఏం చెప్పాలన్నారు.
Also Read : Gaddar Mass Voice : గద్దర్ మాస్ వాయిస్
