Parliament Session : 18 నుంచి పార్లమెంట్ సమావేశాలు
ఆగస్టు 12 వరకు కొనసాగుతాయి
Parliament Session : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈనెల 18 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా వెల్లడించారు. ఈ సమావేశాలు వచ్చే నెల ఆగస్టు 12 వరకు కొనసాగుతాయి.
విశేషం అంటే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలి రోజే భారత దేశంలో సర్వోన్నత పదవిగా భావించే రాష్ట్రపతి పదవి కోసం ఎన్నిక జరగనుంది. ఇప్పటికే కేంద్రంలో కొలువు తీరిన ఎన్డీయే తరపున మాజీ గవర్నర్ ఒడిశాకు చెందిన ద్రౌపది ముర్ము బరిలో ఉన్నారు.
విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పోటీ చేస్తున్నారు. రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈనెల 21న జరగనుంది. ఆరోజు సాయంత్రమే ఫలితాలు ప్రకటిస్తుంది కేంద్ర ఎన్నికల సంఘం.
మరో వైపు ఆగస్టు 6వ తేదీన ఉప రాష్ట్రపతి పదవికి ఎన్నిక జరగనుంది. కొత్త ఉప రాష్ట్రపతి ఆగస్టు 11న బాధ్యతలు చేపడతారు.
ఇదిలా ఉండగా జూలై 18 నుంచి ఆగస్టు 12 దాకా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు(Parliament Session) నిర్వహించాలని పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ ఇటీవల ప్రతిపాదించింది.
స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ముందుగానే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిస్తున్నట్లు తెలిపింది. ఈ సమావేశాలు 18 రోజుల పాటు జరగనున్నాయి.
ఈ ఏడాది శీతాకాల పార్లమెంట్ సమావేశాలు కొత్తగా నిర్మించిన భవనంలో నిర్వహించనున్నట్లు సభాపతి ఓం బిర్లా స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఆదివాసి పేరుతో బీజేపీ ముందుకు వెళుతోంది
రాష్ట్రపతి విషయంలో. ఇదే సమయంలో విపక్షాలు ఎలాగైనా సరే బీజేపీకి, మోదీకి షాక్ ఇవ్వాలని ప్రయత్నం చేస్తోంది.
Also Read : మరాఠా యోధుడే నాకు ఆదర్శం