Partha Chatterjee : పార్థా ఛ‌ట‌ర్జీ ఫోన్ చేసినా ప‌ల‌క‌ని సీఎం

మ‌నీ లాండ‌రింగ్ ఆరోప‌ణ‌లపై అరెస్ట్

Partha Chatterjee : ప‌శ్చిమ బెంగాల్ లో విద్యా శాఖ కు సంబంధించిన స్కాంలో తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఒక‌ప్ప‌టి విద్యా శాఖ‌, ప్ర‌స్తుతం వాణిజ్య, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి పార్థ ఛ‌ట‌ర్జీని(Partha Chatterjee) ఈడీ అదుపులోకి తీసుకుంది.

ప్ర‌స్తుతం ఆయ‌న‌ను చికిత్స నిమిత్తం ఎయిమ్స్ కు త‌ర‌లించింది. అయితే పార్థ ఛ‌ట‌ర్జీ స‌న్నిహితురాలు, హీరోయిన్ గా పేరొందిన అర్షిత ఛ‌ట‌ర్జీ

ఇంట్లో ఈడీ దాడి చేసింది.

క‌ళ్లు బైర్లు క‌మ్మేలా రూ. 20 కోట్ల రూపాయ‌ల న‌గ‌దు బ‌య‌ట ప‌డింది. అన్నీ రూ. 500, రూ. 2,000 నోట్ల క‌ట్టలే. ఇక 20 కీల‌క మొబైల్స్ కూడా స్వాధీనం చేసుకుంది.

ఇదే స‌మ‌యంలో బెంగాల్ విద్యా శాఖ స‌హాయ మంత్రితో పాటు ఎమ్మెల్యే పై కూడా ఏక కాలంలో దాడులు చేసింది. ఈ సంద‌ర్బంగా అధికార

తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ పార్థ ఛ‌ట‌ర్జీ అరెస్ట్ పై జోక్యం చేసుకోబోమంటూ ప్ర‌క‌టించింది.

ఈ విష‌యాన్ని ఆ పార్టీ అధికార ప్ర‌తినిధి కుషాల్ ఘోష్ స్ప‌ష్టం చేశారు. ఇదిలా ఉండ‌గా తాజాగా అందిన స‌మాచారం మేర‌కు అరెస్ట్ అయిన మంత్రి పార్థ ఛ‌ట‌ర్జీ మూడు సార్లు రాష్ట్ర ముఖ్య‌మంత్రి మ‌మతా బెన‌ర్జీకి కాల్ చేసిన ప‌ట్టించు కోలేద‌ని ఈడీ వ‌ర్గాలు వెల్ల‌డించ‌డం విశేషం.

మ‌రో వైపు కేసుకు సంబంధించి మంత్రి స‌హ‌క‌రించ‌డం లేద‌ని, ఆయ‌న మాఫియా డాన్ లాగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. అరెస్ట్

అయిన 1.55 గంట‌ల‌కు ఫోన్ చేసినా తీయ‌లేద‌ని ఈడీ తెలిపింది.

ఆ త‌ర్వాత 2.33కి, 3.37 నిమిషాల‌కి, 9.35 గంట‌ల‌కు రింగ్ చేసినా తీయ‌లేద‌ని పేర్కొంది. నిందితులు ఎవ‌రైనా త‌మ అరెస్ట్ గురించి తెలియ చేసేందుకు బంధువు లేదా స్నేహితుడికి కాల్ చేసేందుకు ప‌ర్మిష‌న్ ఇస్తారు.

అయితే టీఎంసీ ఈడీ చేసిన ఆరోప‌ణ‌ల్ని ఖండించింది. ఎలాంటి ఫోన్ రాలేద‌ని స్ప‌ష్టం చేసింది.

Also Read : లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ స‌భ్యుల అరెస్ట్

Leave A Reply

Your Email Id will not be published!