Saugata Roy : పార్థ ఛటర్జీ అరెస్ట్, పార్టీకి తీరని అవమానం
టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్ కామెంట్స్
Saugata Roy : నిన్నటి దాకా కేంద్రంపై నిప్పులు చెరుగుతూ వచ్చిన టీఎంసీ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కి ఊహించని రీతిలో షాక్ ఇచ్చారు ప్రధాన మంత్రి అండ్ టీం.
గత కొంత కాలంగా ఉప్పు నిప్పు లాగా మారి పోయింది కేంద్రం వర్సెస్ బెంగాల్. ఇదే సమయంలో గవర్నర్ వద్దంటూ తీర్మానం చేసింది ప్రభుత్వం. అదే గవర్నర్ ను ఇప్పుడు ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఖరారు చేశారు మోదీ.
ప్రధాని ఎక్కువగా మాట్లాడరు. కానీ ఒక్కసారి డిసైడ్ అయ్యారంటే ఇక ఖేల్ ఖతమే. ఇప్పుడు అదే జరిగింది. కేంద్ర దర్యాప్తు సంస్థ యధావిధిగా రంగంలోకి దిగింది.
టీఎంసీలో కీలక పాత్ర పోషిస్తూ కేబినెట్ లో సీనియర్ గా ఉన్న పార్థ ఛటర్జీ, ఆయన సహచరురాలిగా పేరొందిన నటి అర్పితా ముఖర్జీ ఇళ్లపై ఏకకాలంలో దాడులు చేసింది.
దిమ్మ తిరిగేలా కోలుకోలేని రీతిలో షాక్ ఇచ్చింది ఈడీ. కళ్లు చెదిరేలా నోట్ల కట్టలు, బంగారం బయట పడింది. ఏకంగా రూ. 50 కోట్ల నగదు, 5 కేజీల బంగారం స్వాధీనం చేసుకుంది.
దీంతో పార్టీ నుంచి , కేబినెట్ నుంచి టీఎంసీ పార్థ ఛటర్జీని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. దీనిపై టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్(Saugata Roy) స్పందించారు. సంచలన కామెంట్స్ చేశారు.
పార్థ ఛటర్జీ అరెస్ట్ కావడం పార్టీకి తీరని అవమానం అంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
కాగా బీజేపీ అగ్ర నేత సువేందు మాత్రం ఇది ట్రైలర్ మాత్రమేనని సినిమా ఇంకా ముందుందన్నారు.
Also Read : పార్థా సరే దొరకని దొంగలు ఎందరో