Amit Shah : టిప్పు సుల్తాన్ నమ్మే పార్టీలవి – షా
కాంగ్రెస్, జేడీఎస్ పై షాకింగ్ కామెంట్స్
Amit Shah : బీజేపీ ట్రబుల్ షూటర్ , కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా(Amit Shah) షాకింగ్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో రాజకీయం మరింత వేడెక్కింది. ఎన్నికల ప్రచారంలో పార్టీలు తలమునకలై ఉన్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర మంత్రి కర్ణాటకలో పర్యటించారు. ఈ సందర్భంగా టిప్పు సుల్తాన్ పై సంచలన వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. గతంలో రాష్ట్రంలో కొలువు తీరిన కాంగ్రెస్ పార్టీ అవినీతికి పాల్పడిందని , ప్రతిపక్ష పార్టీ కర్ణాటకను గాంధీ కుటుంబానికి ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్ (ఏటీఎం) గా ఉపయోగించుకుందని అమిత్ షా ఆరోపించారు.
కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల వల్ల రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదన్నారు. 18వ శతాబ్దపు మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్ ను కాంగ్రెస్ , జేడీఎస్ పార్టీలు విశ్వసించాయని, ఆ రెండు పార్టీల వల్ల ప్రజలకు మోసం తప్ప న్యాయం జరగలేదన్నారు అమిత్ చంద్ర షా. 16వ శతాబ్దపు తుళువ రాణి ఉల్లాల్ రాణి అబ్బక్క చౌటా రాష్ట్రంలో సుసంపన్నమైన పాలన కోసం కృషి చేసిందని కొనియాడారు.
తాము ఆమె వారసులమని పేర్కొన్నారు. తాము టిప్పు సుల్తాన్ ను ఒప్పుకోమంటూ స్పష్టం చేశారు. ఈ జాతికి ఘనమైన వారసత్వం ఉందని దానిని గుర్తించి పరిరక్షించేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు అమిత్ చంద్ర షా(Amit Shah).
దక్షిణ కన్నడ జిల్లాలోని పుత్తూరులో సెంట్రల్ అరెకానట్ , కోకో మార్కటింగ్ , ప్రాసెసింగ్ కో ఆపరేటివ్ లిమిటెడ్ స్వర్ణోత్సవ వేడుకలలో అమిత్ చంద్ర షా పాల్గొన్నారు. అనంతరం ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. టిప్పు సుల్తాన్ ను విశ్వసించే కాంగ్రెస్ , జేడీఎస్ కు ఓటు వేస్తారా లేక రాణి అబ్బక్కపై నమ్మకం ఉంచిన బీజేపీని ఆదరిస్తారా చెప్పాలన్నారు కేంద్ర మంత్రి.
Also Read : సామరస్యం భారత్ డీఎన్ఏలో ఉంది