Biplab Deb : పార్టీ నిర్ణయం శిరోధార్యం – బిప్లబ్ దేబ్
ఏ పదవి ఇచ్చినా సమ్మతమే
Biplab Deb : ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో త్రిపురలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చిన నాయకుడిగా గుర్తింపు పొందారు బ్లిపబ్ కుమార్ దేబ్(Biplab Deb). ఆయన సీఎంగా ఎన్నికయ్యారు.
కానీ రాష్ట్రంలో ఇంకో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అనూహ్యంగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, ఆధిపత్య పోరు వల్లనే బిప్లబ్ దేబ్ ను తప్పించారని ప్రచారం జరిగింది.
ఈ సమయంలో ఎలాంటి ఆలస్యం చేయకుండానే బిప్లబ్ దేబ్ స్థానంలో డాక్టర్ మాణిక సాహాను భారతీయ జనతా పార్టీ హైకమాండ్ నూతన సీఎంగా ఎంపిక చేసింది.
ఈ తరుణంలో సీఎం పదవికి రాజీనామా చేసిన అనంతరం బిప్లబ్ దేబ్ మీడియాతో మాట్లాడారు. పార్టీ నిర్ణయం అంతిమమని, ఏ పదవి అప్పగించినా లేదా ఇవ్వక పోయినా తాను సామాన్య కార్యకర్తగా పని చేస్తానని చెప్పారు.
రాబోయే ఎన్నికల్లో మరోసారి బీజేపీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకు రావడమే తన ముందున్న కర్తవ్యమని స్పష్టం చేశారు బిప్లబ్ దేబ్(Biplab Deb). తాను పార్టీకి క్రమశిక్షణ కలిగిన సైనికుడినని పేర్కొన్నారు మాజీ సీఎం.
తన పాత్ర ఏమిటనేది, తాను ఏం చేయాలన్నది పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుందని చెప్పారు. ఇదిలా ఉండగా సీఎం మార్పుపై తమతో సంప్రదించకుండానే సాహాను ఎలా ఎంపిక చేస్తారంటూ బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు హై కమాండ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే రామ్ ప్రసాద్ పాల్ ఈ చర్యను నిరసిస్తూ కుర్చీలను విరగ్గొట్టారు. అయితే తనతో కలిసి పని చేసిన వారు భావోద్వేగానికి లోను కావడం సహజమన్నారు.
Also Read : న్యాయ నిరాకరణ అరాచకానికి మార్గం – సీజేఐ