Ashok Gehlot : సీఎం ప‌ద‌వి కంటే పార్టీ ముఖ్యం – గెహ్లాట్

పార్టీ హైక‌మాండ్ నిర్ణ‌యం శిరోధార్యం

Ashok Gehlot : రాజ‌స్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. రాజ‌స్థాన్ లో చోటు చేసుకున్న సంక్షోభానికి తెర దించే ప్ర‌య‌త్నం చేశారు. నిన్న‌టి దాకా పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వి రేసులో ఉన్న సీఎం ఉన్న‌ట్టుండి త‌ప్పుకున్నారు. రాష్ట్రంలో చోటు చేసుకున్న ప‌రిణామాల నేప‌థ్యంలో మేడం సోనియా గాంధీని క‌లుసుకున్నారు. అనంత‌రం తాను పోటీలో లేన‌ని ప్ర‌క‌టించారు. అనంత‌రం అశోక్ గెహ్లాట్(Ashok Gehlot) మీడియాతో మాట్లాడారు.

త‌న‌కు రాష్ట్ర ముఖ్య‌మంత్రి ప‌ద‌వి కంటే పార్టీ ముఖ్య‌మని స్ప‌ష్టం చేశారు. పార్టీ హైక‌మాండ్ ఏది నిర్ణ‌యిస్తే దానికి క‌ట్టుబ‌డి ఉంటాన‌ని ప్ర‌క‌టించారు. తాను ఏనాడూ పద‌వుల కోసం పాకులాడ లేద‌ని పేర్కొన్నారు. ఇప్ప‌టికే పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వి రేసులో అకోశ్ గెహ్లాట్ త‌ప్పుకున్న త‌ర్వాత దిగ్విజయ్ సింగ్ తో పాటు మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే పోటీలో నిలిచారు. మ‌ల్లికార్జున్ ఖ‌ర్గేకు(Mallikarjun Kharge) ప్ర‌తిపాద‌కుడిగా ఉంటాన‌ని పేర్కొన్నారు.

రాజ‌స్థాన్ లో చోటు చేసుకున్న సంక్షోభం త‌న‌ను క‌లిచి వేసింద‌న్నారు. ఇందుకు సంబంధించి తాను నైతిక బాధ్య‌త వ‌హిస్తాన‌ని చెప్పారు అశోక్ గెహ్లాట్. ఇప్ప‌టికే మేడం సోనియా గాంధీని క‌లిసి క్ష‌మాప‌ణ‌లు చెప్పాన‌ని తెలిపారు. పార్టీ అన్నాక సంక్షోభం అన్న‌ది స‌హ‌జ‌మేన‌ని పేర్కొన్నారు.

త‌న‌కు ప‌ద‌వులు ముఖ్యం కాద‌ని మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. అర్ద శ‌తాబ్ధ కాలంగా వివిధ ప‌ద‌వుల్లో ఉన్నాన‌ని ఇక‌పై త‌న‌కు అవి ముఖ్యం కాద‌న్నారు అశోక్ గెహ్లాట్. ప్ర‌స్తుతం సీఎం చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపాయి. ఒక‌వేళ ఆయ‌న త‌ప్పుకుంటే స‌చిన్ పైల‌ట్(Sachin Pilot) సీఎం కానున్నారు.

Also Read : నేను అస‌మ్మ‌తి నాయ‌కుడిని కాను – శ‌శి థ‌రూర్

Leave A Reply

Your Email Id will not be published!