YS Jagan : ప్రగతి పథం ఏపీ ప్రభుత్వ లక్ష్యం
అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయం
YS Jagan : తమ ప్రభుత్వ లక్ష్యం అన్ని వర్గాల సంక్షేమం. ఎన్ని అవాంతరాలు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నిధులు కేటాయించడం కంటిన్యూగా కొనసాగుతూనే ఉంటుంది.
ఇందులో ఎలాంటి అనుమానం లేదు. విద్య, వైద్యం, ఉపాధి, పరిశ్రమల ఏర్పాటు, వ్యవసాయం, టెక్నాలజీ, మహిళా సాధికారతపై ఎక్కువగా ఫోకస్ పెట్టామని చెప్పారు ఏపీ సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి(YS Jagan).
వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం ద్వారా నాలుగో విడత కింద 80,546 మంది లబ్దిదారులైన నేతన్నలకు రూ. 193.31 కోట్లను బటన్ నొక్కి జమ చేశారు.
నేతన్నలు పడుతున్న ఇబ్బందులను తాను ఎన్నికల కంటే ముందు చేపట్టిన 3,648 కిలోమీటర్ల పాదయాత్రలో కళ్లారా చూశానని అన్నారు జగన్ రెడ్డి.
ఇచ్చిన మాట కోసం కట్టుబడి ఉన్నానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన చేనేత కార్మికులకు విశిష్టమైన స్థానం ఉందన్నారు సీఎం. ఆనాటి స్వాతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించిన ఘనత కూడా మనదేనని పేర్కొన్నారు.
భారత జాతి ఔన్నత్యానికి ప్రతీకగా నిలిచిన త్రివర్ణ పతాకాన్ని రూపొందించిన ఘనత మన రాష్ట్రానికి చెందిన పింగళి వెంకయ్య చౌదరికి దక్కుతుందన్నారు సందింటి జగన్ మోహన్ రెడ్డి(YS Jagan).
శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా ప్రతి చోటా చేనేతన్నల దయనీయ స్థితిని తాను చూశానని, చలించి పోయానని అందుకే వారిని ఆదుకునేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు.
ప్రతి సంవత్సరం ఒక్కో చేనేత కార్మికుల కుటుంబానికి రూ. 24 వేల చొప్పున జమ చేస్తూ వస్తున్నాం. ఇది వారి బతుకులకు భరోసా ఇస్తుందని తెలిపారు సీఎం. ఇప్పటి వరకు ఈ పథకం కింద ఒక్కో కుటుంబానికి రూ. 96 వేలకు పైగా ప్రయోజనం చేకూరిందన్నారు.
Also Read : రాబోయే ఎన్నికల్లో హస్తందే హవా