Patiala Violence : పంజాబ్ లోని పాటియాలలో రెండు గ్రూపుల మధ్య ఘర్షణ పడ్డాయి. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఇదిలా ఉండగా పాటియాలా హింసాకాండ ఘటన దురదృష్టకరమని , రాష్ట్రంలో ఎవరు అల్లకల్లోలం (Patiala Violence)సృష్టించాలని చూస్తే సహించ బోమని హెచ్చరించారు సీఎం భగవంత్ మాన్.
కాగా హింస కారణంగా ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. శుక్రవారం పాటియాలలో (Patiala Violence)ఖలిస్థాన్ వ్యతిరేక నిరసన ప్రదర్శన చేపట్టారు. రెండు గ్రూపులు ఘర్షణకు దిగాయి.
దీంతో కొన్ని ప్రాంతాలు ఉద్రిక్తంగా మారాయి. గుంపులను, గ్రూపులను చెదరగొట్టేందుకు పలీసులు ప్రయత్నించారు. కానీ ఎంతకూ తగ్గక పోవడంతో గాలి లోకి కాల్పులు జరిపారు.
సీఎం ఈ ఘటనపై సీరియస్ అయ్యారు. ఎవరూ ఆందోళన చెంద వద్దని , సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు భగవంత్ మాన్. ఇవాళ నేను డీజీపీ తో మాట్లాడాను. ఆ ప్రాంతంలో వెంటనే శాంతిని పునరుద్దరించాం.
పరిస్థితి అదుపు తప్పకుండా ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తున్నట్లు చెప్పారు భగవంత్ మాన్. పంజాబ్ అన్నది సామరస్యానికి ప్రతీక.
ఇక్కడ ఎవరు అల్లర్లు సృష్టించేందుకు యత్నించినా వెంటనే గుర్తించి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పంజాబ్ సీఎం. జిల్లా పరిపాలన యంత్రాంగం శాంతి, సామరస్యాన్ని కాపాడు కోవాలని ప్రజలకు విన్నవించింది.
ఇదిలా ఉండగా పాటియాలాలో శివసేన మద్దతుదారులు వర్సెస్ ఖలిస్తాన్ వేర్పాటువాదుల మధ్య యుద్ధం మొదలైంది. ఈ మొత్తం వ్యవహారంపై తనకు పూర్తి నివేదిక ఇవ్వాలంటూ ఆదేశించారు పంజాబ్ సీఎం భగవంత్ మాన్.
Also Read : ఢిల్లీ సీఎం తీరుపై శశి థరూర్ సెటైర్