Patnam Mahender Reddy : ‘పట్నం’కు లైన్ క్లియర్
మంత్రిగా నేడు ప్రమాణం
Patnam Mahender Reddy : ఎట్టకేలకు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డికి లైన్ క్లియర్ అయ్యింది. ఆయన రాష్ట్ర కేబినెట్ లోకి రాబోతున్నారు. గతంలో ఎమ్మెల్యేగా గెలుపొందిన సమయంలో రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు. అనూహ్యంగా ఓటమి పాలయ్యారు.
ఆయనకు కేసీఆర్ ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇచ్చారు. ఇటీవల ప్రస్తుత ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో ఆధిపత్య పోరు కొనసాగింది. చివరి వరకు టికెట్ కోసం పోటీ పడ్డారు పట్నం మహేందర్ రెడ్డి. తాజాగా పార్టీ బాస్ , సీఎం కేసీఆర్ ఊహించని రీతిలో పట్నంకు షాక్ ఇచ్చారు.
Patnam Mahender Reddy As a MLC
తిరిగి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పైలట్ రోహిత్ రెడ్డికే ఛాన్స్ ఇచ్చారు. దీంతో కొంత ఇబ్బందికరంగా ఫీల్ అయ్యారు . టికెట్ తిరిగి పొందిన పైలట్ ఊహించని రీతిలో పట్నం ఇంటికి వెళ్లారు. ఆయన కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు.
పట్నం మహేందర్ రెడ్డిని(Patnam Mahender Reddy), పైలట్ రోహిత్ రెడ్డిని కలిపారు కేసీఆర్. ఇద్దరూ సర్దుకు పోవాలని ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ జెండా ఎగుర వేసేలా కృషి చేయాలని ఆదేశించారు.
దీంతో పట్నం మహేందర్ రెడ్డికి ఊహించని గిఫ్ట్ ఇచ్చారు. కేబినెట్ లోకి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఇవాళ ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండగా గవర్నర్ లేక పోవడంతో వాయిదా పడింది. ఇవాళ ఆయనకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు సమాచారం.
Also Read : Rythu Bandhu : రైతు బంధు సంపూర్ణం