Pattabhi : బాబు అరెస్ట్ దారుణం – పట్టాభి
ఏపీ సర్కార్ కావాలని చేసింది
Pattabhi : విజయవాడ – టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి నిప్పులు చెరిగారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కీం స్కామ్ లో ప్రధాన పాత్ర ఉందంటూ టీడీపీ జాతీయ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రాబు నాయుడును ఏపీ సీఐడీ నంద్యాలలో అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా వైద్య పరీక్షలు కూడా చేపట్టారు. తన వాహనంలోనే ఆయనను తరలించారు.
Pattabhi Comments on Chandrababu Arrest
నంద్యాల నుంచి విజయవాడకు తరలించారు తన వాహనంలో. భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా చంద్రబాబు నాయుడును(Pattabhi) అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు పార్టీ ప్రతినిధి పట్టాభి. ఇది పూర్తిగా అప్రజాస్వామికమని పేర్కొన్నారు. దీనిని ప్రతి ఒక్కరు ఖండించాలని పిలుపునిచ్చారు.
రాత్రి పూట ఏపీ పోలీసులు ఆ ప్రాంతానికి వచ్చి పెద్ద ఎత్తున రభస సృష్టించారని , తాను ఏ తప్పు చేయలేదని, ఆధారాలు చూపించాలంటూ కోరినా పోలీసులు చూపించ లేక పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందన్నారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు పట్టాభి. తమ నాయకుడిని ఎక్కడికి తీసుకు వెళుతున్నారో తెలియడం లేదన్నారు.
ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా తమ పార్టీ సీనియర్ నాయకులను, నేతలను అదుపులోకి తీసుకున్నారని ఎందుకు ఇలా చేస్తున్నారంటూ ప్రశ్నించారు పట్టాభి.
Also Read : Chandrababu Naidu Tests : చంద్రబాబుకు వైద్య పరీక్షలు