Pawan Kalyan : రైతన్నలను సర్కార్ ఆదుకోవాలి
జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్
Pawan Kalyan : అమరావతి – ఏపీలో ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల ధాటికి ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను రైతులు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్. ప్రభుత్వం ఆశించిన మేర స్పందించడం లేదని ఆరోపించారు. నష్ట పోయిన రైతులను ఆదుకోవాలని, లోతట్టు ప్రాంతాలలో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు.
Pawan Kalyan Comment
ఏపీ సర్కార్ ముందు జాగ్రత్తగా చర్యలు చేపట్టి ఉంటే ఇంత నష్టం వాటిల్లి ఉండేది కాదని అభిప్రాయపడ్డారు పవన్ కళ్యాణ్(Pawan Kalyan). జనసేన పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు, అభిమానులు సహాయ కార్యక్రమాలలో పాలు పంచుకోవాలని పిలుపునిచ్చారు.
ఏపీ సీఎం జగన్ రెడ్డి వెంటనే స్పందించి పంటలు కోల్పోయిన రైతులకు నష్ట పరిహారం వెంటనే చెల్లించే ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు పవన్ కళ్యాణ్. అంతే కాకుండా కురుస్తున్న వర్షాలకు ప్రాణాలు కోల్పోయిన వారికి ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని కోరారు.
తాను కూడా బాధితులను పరామర్శిస్తానని, చేతనైనంత సాయం అందించేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్. ఇదిలా ఉండగా తుఫాను తీవ్రత దెబ్బకు తమిళనాడు తల్లడిల్లుతుంటే ఏపీలో పలు చోట్ల ఇబ్బందులకు గురి చేసింది.
Also Read : K Narayana Swamy : కాంగ్రెస్ గెలిస్తే టీడీపీ సంబురాలా