Pawan Kalyan : తెలంగాణ యువత చైతన్యానికి ప్రతీక
జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్
Pawan Kalyan : కొత్తగూడెం – తెలంగాణలో యువత చైతన్యానికి ప్రతీక అని ప్రశంసించారు జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్. ఇది పోరాటాలకు, ఉద్యమాలకు పెట్టింది పేరు. నీళ్లు, నియామకాల కోసం ఆనాడు ఉద్యమం జరిగిందని గుర్తు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి మద్దతుగా గురువారం కొత్తగూడెంలో జరిగిన సభలో ప్రసంగించారు.
Pawan Kalyan Praises Telangana Youth
ఆనాడు బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మద్దతు ఇచ్చిన విషయం మరిచి పోవద్దన్నారు. సుస్థిరమైన పాలన , అభివృద్ది అనేది కేవలం బీజేపీ నుంచి సాధ్యమైందని అన్నారు పవన్ కళ్యాణ్(Pawan Kalyan). ప్రస్తుతం జరుగుతున్న శాసన సభ ఎన్నికల్లో 26 మంద జన సైనికులు త్యాగం చేశారని చెప్పారు.
తెలంగాణలో అవినీతి రాజ్యం ఏలుతోందన్నారు. అందుకే బీజేపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. సింగరేణిలో ఉద్యోగాలు స్థానికులకు రావాలని, ఇవి మీకు పొందాలంటే, దక్కాలంటే బీజేపీని ఆశీర్వదించాలని కోరారు.
తెలంగాణ ప్రజల కోసం , రాష్ట్ర అభ్యున్నతి కోసం తాను బీజేపీకి మద్దతు ఇవ్వడం జరిగిందని చెప్పారు పవన్ కళ్యాణ్. ప్రజా సమస్యలపై నిరంతరం తాను గొంతెత్తుతూనే ఉంటానని స్పష్టం చేశారు జనసేన పార్టీ చీఫ్.
Also Read : Shashi Tharoor : బీసీసీఐపై శశి థరూర్ ఫైర్