Pawan Kalyan : రైతన్నలకు జనసేనాని భరోసా
వ్యవసాయ రంగానికి ప్రయారిటీ
Pawan Kalyan : జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ సాగు చేసుకునే రైతులకు భరోసా ఇచ్చారు. వారి ఇబ్బందులు తొలగించేందుకు తాను ప్రయత్నం చేస్తానని స్పష్టం చేశారు. ఆయన చేపట్టిన వారాహి విజయ యాత్ర నిరాటంకంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా కోనసీమలో బిజీ బిజీగా మారారు. మేధావులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో చర్చలు జరిపారు. యానంలో భారీ ర్యాలీ చేపట్టారు. ఇదిలా ఉండగా బుధవారం రైతు నాయకులతో సుదీర్ఘంగా చర్చించారు.
రైతులు ఈ ప్రాంతంలో ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ఏకరువు పెట్టారు. వారు అందించిన సూచనలు, సలహాలను సావధానంగా విన్నారు పవన్ కళ్యాణ్.
రాష్ట్రంలో రాచరిక పాలన సాగుతోందని అన్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా సరే రైతులను ఆదుకుంటామని స్పష్టం చేశారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తాను మీకు అండగా ఉంటానని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్(Pawan Kalyan). తాను ఉన్నంత వరకు మీకు ఎలాంటి కష్టం రానివ్వని అన్నారు.
ప్రభుత్వం ప్రస్తుతం మాయ మాటలు చెప్పి మోసం చేసిందన్నారు. వ్యవసాయ రంగాన్ని పక్కన పెట్టిందన్నారు జనసేన పార్టీ చీఫ్. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను సర్వ నాశనం చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు పవన్ కళ్యాణ్. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు కనీస మద్దతు ధర కల్పించడంలో విఫలం అయ్యారంటూ మండిపడ్డారు జనసేనాని.
Also Read : Bhatti Vikramarka : బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు శాపం