Pawan Kalyan : ఆవిర్భావ స‌భ‌కు జ‌న‌సేనాని

ఆటోన‌గ‌ర్ లో ప‌వ‌న్ కు గ్రాండ్ వెల్ క‌మ్

Pawan Kalyan 10th Formation : జ‌న‌సేన పార్టీ చీఫ్ ప‌వన్ క‌ళ్యాణ్ మ‌చిలీప‌ట్నంకు బ‌య‌లు దేరారు. మార్చి 14న జ‌న‌సేన పార్టీ 10వ ఆవిర్భావ స‌భ జ‌ర‌గ‌నుంది. ఇందుకు సంబంధించి ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న ప్ర‌చార ర‌థం వారాహి నుంచి విజ‌య‌వాడ‌కు చేరుకున్నారు.

న‌గ‌రంలోని ఆటో న‌గ‌ర్ కు చేరుకోగానే భారీ ఎత్తున ప‌వ‌ర్ స్టార్ కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు పార్టీకి చెందిన జ‌నసేన పార్టీకి చెందిన కార్య‌క‌ర్త‌లు. పెద్ద ఎత్తున భ‌ద్ర‌త ఏర్పాట్లు చేశారు. త‌నకు గ్రాండ్ వెల్ క‌మ్ చెప్పిన వారంద‌రికీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభివాదం చేశారు.

ఇదిలా ఉండ‌గా జ‌న‌సేన పార్టీ ఆధ్వ‌ర్యంలో చేప‌ట్ట‌నున్న ఆవిర్భావ స‌భ‌కు విస్తృత ఏర్పాట్లు చేశారు నిర్వాహ‌కులు. అన్నీ తానై వ్య‌వ‌హ‌రిస్తున్నారు పీఏసీ చైర్మన్ నాదెండ్ల మ‌నోహ‌ర్. ఇదిలా ఉండ‌గా కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. జ‌న‌సేన పార్టీ ఆధ్వ‌ర్యంలో ఎలాంటి ప్ర‌ద‌ర్శ‌న‌లు, ర్యాలీలు, ఆందోళ‌నలు చేప‌ట్టేందుకు అనుమ‌తి ఇవ్వ‌డం కుద‌ర‌ద‌ని తేల్చి చెప్పారు. మార్చి 14, 2014 లో జ‌నసేన పార్టీని ఏర్పాటు చేశారు ప‌వ‌న్ క‌ళ్యాణ్ .

1,20,000 వేల మందికి పైగా మ‌చిలీప‌ట్నం లో నిర్వ‌హిస్తున్న ఆవిర్భావ స‌భ‌కు హాజ‌రు కానున్న‌ట్లు జ‌న‌సేన పార్టీ నిర్వాహ‌కులు అంచ‌నా వేస్తున్నారు. హాజ‌ర‌య్యే వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. నీళ్లు, టీ, ఆహారంతో పాటు వైద్య సౌక‌ర్యాలు కూడా ఏర్పాటు చేశారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు (Pawan Kalyan 10th Formation) మ‌ద్ద‌తుగా అభిమానులు భారీగా బైక్ ర్యాలీ చేప‌ట్టారు.

Also Read : జ‌న పక్షం జెండా జ‌న‌సేన ఎజెండా

Leave A Reply

Your Email Id will not be published!