Pawan Kalyan : పవన్ కామెంట్స్ పై కోర్టు విచారణ
వాలంటీర్లపై నోరు పారేసుకున్న జనసేనాని
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ – జనసేన పార్టీ చీఫ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో పని చేస్తున్న వాలంటీర్లపై నోరు పారేసుకున్నారు. అనరాని మాటలు అన్నారు. ఆపై వారిని వ్యక్తిగతంగా దూషించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లుగా పని చేస్తున్న వారంతా నిప్పులు చెరిగారు. వెంటనే బేషరతు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆపై పవన్ కళ్యాణ్ దిష్టి బొమ్మలను దగ్దం చేశారు.
Pawan Kalyan Comment Viral
వాలంటీర్లు దుమ్మెత్తి పోశారు. తమకు ప్రభుత్వం పెద్ద ఎత్తున సహకారం అందిస్తోందని ఈ సమయంలో అనుచిత వ్యాఖ్యలు ఎలా చేస్తారంటూ ప్రశ్నించారు. ఇదే సమయంలో తమను పవన్ కళ్యాణ్(Pawan Kalyan) దూషించడాన్ని సవాల్ చేస్తూ కోర్టుకు ఎక్కారు.
దీంతో ఈ కేసుకు సంబంధించి శుక్రవారం విజయవాడ కోర్టులో విచారణకు రానుంది. ఎలాంటి తీర్పు వెలువడుతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది జనసేన పార్టీ శ్రేణుల్లో. కాగా వైసీపీ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని రీతిలో వాలంటీర్ల వ్యవస్థను తీసుకు వచ్చింది. నెలకు ప్రతి ఒక్కరికీ రూ. 5 వేలు చొప్పున గౌరవ వేతనంగా ఇస్తోంది.
వాలంటీర్లు గ్రామ సచివాలయాల్లో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రజలకు విస్తృతమైన సేవలు అందజేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలలో కీలకమైన పాత్ర పోషిస్తున్నారు.
Also Read : Nara Lokesh : ఢిల్లీలో నారా లోకేష్ బిజీ