Pawan Kalyan : జగన్ ఓ క్రిమినల్ – పవన్
ఏపీ సీఎంపై షాకింగ్ కామెంట్స్
Pawan Kalyan : విజయవాడ- జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. అర్ధరాత్రి హై డ్రామా చోటు చేసుకుంది. చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. పవన్ కళ్యాణ్ హుటా హుటిన హైదరాబాద్ నుంచి మంగళగిరికి వచ్చేందుకు ప్రయత్నం చేశారు.
Pawan Kalyan Shocking Comments
ఆయన వస్తే ఉద్రిక్తత చోటు చేసుకుంటుందని, రాకుండా నిలిపి వేయాలని ఎస్పీ ఎయిర్ పోర్టు ఆఫీసర్స్ కు లేఖ రాశారు. దీంతో ఫ్లైట్ ఎక్కకుండా నిలిపి వేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత మధ్య రోడ్డు మార్గం ద్వారా విజయవాడకు చేరుకున్నారు.
మీడియాతో మాట్లాడారు పవన్ కళ్యాణ్(Pawan Kalyan). జగన్ రెడ్డి కావాలని కక్ష సాధింపుతో చంద్రబాబును ఇరికించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. తమ నేతను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని పార్టీ శ్రేణులు ఆందోళనలు, నిరసనలు తెలిపే హక్కు వారికి ఉంటుందని అన్నారు పవన్ కళ్యాణ్.
జగన్ మోహన్ రెడ్డి ఒత్తిళ్ల మేరకే ఏపీ సీఐడీ చంద్రబాబును ఇరికించేందుకు ప్రయత్నం చేసిందని సంచలన ఆరోపణలు చేశారు. న్యాయం, ధర్మం చివరకు గెలవడం ఖాయమన్నారు. చంద్రబాబు నాయుడు వయసు, రాజకీయ అనుభవాన్ని పరిగణలోకి తీసుకోక పోవడం దారుణమన్నారు.
Also Read : Chandrababu Naidu : వేధించారు నన్ను ఇరికించారు