Pawan Kalyan : కేసీఆర్ త్వరగా కోలుకోవాలి – పవన్
ఆరోగ్యంపై ఆరా
Pawan Kalyan : అమరావతి – మాజీ సీఎం కేసీఆర్ కు కాలం కలిసి రావడం లేదు. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని అనుకున్న ఆయనకు ఉన్నట్టుండి ఫలితాలు ఆశాజనకంగా రాలేదు. దీంతో తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఫామ్ హౌస్ కే పరిమితమైన కేసీఆర్ బాత్రూంలో జారి పడ్డారు. ఆయనను హుటా హుటిన హైదరాబాద్ లోని యశోద ఆస్పత్రికి తరలించారు. ఆయనకు మెరుగైన వైద్య చికిత్సలు అందజేస్తున్నారు. తాజాగా హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
Pawan Kalyan Comment on KCR Health
ఇదే సమయంలో ఆయన అనారోగ్యానికి గురైన విషయం తెలిసిన పలువురు నేతలు ఆరా తీస్తున్నారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని కోరారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి . ఈ మేరకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు ఆరోగ్య కార్యదర్శి యశోదకు చేరుకున్నారు. ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్యంపై వివరాలు అందించాలని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. శుక్రవారం ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయనకు గాయమైందని బాధ పడ్డానని తెలిపారు. కేసీఆర్ సంపూర్ణంగా తిరిగి రావాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఎన్నో సవాళ్లను ఆయన ఒక్కడే అధిగమించారని కొనియాడారు.
Also Read : Sukesh Chandrasekhar : కవిత..కేటీఆర్ అరెస్ట్ ఖాయం