Pawan Kalyan : అడవి బిడ్డలకు విద్య, వైద్యం ఉండాలి
జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ డిమాండ్
Pawan Kalyan : అడవిని తల్లిని నమ్ముకున్న ఆదివాసీ , గిరిజన బిడ్డల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్. కొండ కోనల్లో నివసిస్తూ సంప్రదాయాలను అనాది నుంచి బతికించుకుంటూ వస్తున్నారు. ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అటవీ ప్రాంతంలో అనువైన పంటలు పండించుకుంటూ వస్తున్నారు. అడవి బిడ్డలు నిత్యం సవాళ్లను ఎదుర్కొంటూ వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్.
Pawan Kalyan raised his voice for tribals
తరాలు మారినా, పాలకులు మారినా గిరిజన బిడ్డల్లో మార్పు రాలేదని ఆవేదన చెందారు. కనీసం విద్యకు, వైద్యానికి నోచుకోవడం లేదని పేర్కొన్నారు జనసేన పార్టీ చీఫ్. చివరకు ప్రసవానికి వెళ్లాలన్నా ముప్పు తిప్పలు పడాల్సి వస్తుందని వాపోయారు పవన్ కళ్యాణ్.
ఇలాంటి దృశ్యాలు ప్రసార మాధ్యమాలలో, డిజిటల్ మీడియాలో నిత్యం కనిపిస్తూనే ఉన్నాయని తెలిపారు. ఇలాంటి దుర్భరమైన పరిస్థితుల నుంచి మారాల్సిన అవసరం ఉందన్నారు. గిరిజనుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ఐటీడీఏ , సంబంధిత విభాగాల్లో సేవా భావం కలిగిన వారిని నియమించాలని సూచించారు పవన్ కళ్యాణ్.
అత్యవసరమైన సమయాలలో గిరిజనుల కోసం , వారి ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా రాష్ట్ర సర్కార్ అంబులెన్సులను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్(Pawan Kalyan). ఆరు కిలోమీటర్లకు హెలికాప్టర్ ను సీఎం ఉపయోగిస్తున్నప్పుడు అడవి బిడ్డలకు ఎందుకు ఏర్పాటు చేయకూడదంటూ ప్రశ్నించారు.
Also Read : Gampa Govardhan : సీఎం కేసీఆర్ కోసం పదవీ త్యాగం