Pawan Kalyan : ఛాన్స్ ఇస్తే ఐటీని అభివృద్ది చేస్తా
జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్
Pawan Kalyan : ప్లీజ్ నన్ను నమ్మండి. ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి. జనసేన పార్టీకి అధికారం వచ్చేలా చేయండి. పవర్ లోకి వస్తే మూడు సంవత్సరాలలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని అభివృద్ది చేస్తానని హామీ ఇచ్చారు ఆ పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్. మూడో విడత వారాహి విజయ యాత్ర(Varahi Vijaya Yatra) సందర్బంగా ఏపీలో పర్యటించారు. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు పవన్ కళ్యాణ్.
Pawan Kalyan Words about Development
ప్రభుత్వం అన్ని రంగాలలో విఫలమైందన్నారు. ఏ ఒక్క రంగాన్ని అభివృద్ది చేసిన పాపాన పోలేదన్నారు. పోలీసు శాఖ కూడా ఈ సర్కార్ తో విసిగి పోయిందని పేర్కొన్నారు దస్పల్లా భూములకు సంబంధించి రూ. 2000 కోట్ల టీడీఆర్ స్కామ్ చోటు చేసుకుందన్నారు. విశాఖ పట్టణం తనకు రెండో ఇల్లు అని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్. ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. గంగవరం పోర్టు ఉద్యోగుల కోసం హర్తాల్ కు దిగుతానని హెచ్చరించారు పవన్ కళ్యాణ్.
రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, బాధితులు ఎక్కువై పోయారని పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడంటూ మండిపడ్డారు. జగన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ తరుణంలో దేశానికి స్వేచ్ఛ లభించినా ఏపీలో రాష్ట్ర ప్రజలకు ఇంకా విముక్తి లభించ లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read : Nara Lokesh : మూడేళ్లలో అమరావతి పూర్తి చేస్తాం