Pawan Kalyan Jagan : ఆంధ్రా వీరప్పన్ జగన్ – పవన్
భూములు దోచు కోవడం వల్లే తెలంగాణ
Pawan Kalyan Jagan : జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. మూడో విడత వారాహి విజయ యాత్ర సందర్బంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆంధ్రా వీరప్పన్ జగన్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పులు చేయించి పబ్బం గడుపుకునే రకం అంటూ మండిపడ్డారు. సీఎం డబ్బు సంపాదన వ్యసనం నుంచి పిచ్చిగా మారిందన్నారు పవన్ కళ్యాణ్.
Pawan Kalyan Jagan Words
పాలించమని అధికారం అప్పగిస్తే పీడించడం మొదలు పెట్టాడంటూ ఫైర్ అయ్యారు. అన్నా, అక్కా, చెల్లెల్లు అని పిలిస్తే మురిసి పోకండని హెచ్చరించారు. అలా పిలుస్తూనే ఇలా మోసం చేయడంలో జగన్ దిట్ట అని ఎద్దేవా చేశారు.
దాని వెనుక జగన్ మాస్టర్ ప్లాన్ దిగి ఉందన్నారు. జగన్ ప్రజా నాయకుడు ఎంత మాత్రం కాదన్నారు. కేవలం సీఎం ముసుగు కప్పుకున్న ఓ బడా వ్యాపారి అని ఆరోపించారు కొణిదెల పవన్ కళ్యాణ్(Pawan Kalyan). ఉత్తరాంధ్రను కావాలని పక్కా ప్లాన్ తో నాశనం చేయాలని జగన్ రెడ్డి ఆలోచిస్తున్నాడని, ఆదిశగా పావులు కదుపుతున్నాడని ధ్వజమెత్తారు. ఇప్పటికే ఏపీని అప్పుల కుప్పగా మార్చేశాడని మండిపడ్డారు. పంచాయతీల నిధులను వాలంటీర్లకు జీతాలు ఇచ్చారంటూ ఆరోపించారు.
Also Read : PM Modi : అవిశ్వాస తీర్మానం దేవుడిచ్చిన వరం