Pawan Kalyan : నానక్ రామ్ గూడలో ఏపీ డేటా
పవన్ కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్
Pawan Kalyan : జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ సంచలన కామెంట్స్ చేశారు. ఆయన మరోసారి ఏపీ సర్కార్ పై , వాలంటీర్ల వ్యవస్థపై నిప్పులు చెరిగారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన మొత్తం డేటా అంతా తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడాలో ఉందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. రెండో విడత వారాహి విజయ యాత్ర బుధవారం కొనసాగింది. ఈ సందర్బంగా ప్రజలను ఉద్దేశించి జగన్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీకి చెందిన కీలకమైన సమాచారం హైదరాబాద్ లో ఎందుకు ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు ఏపీ సీఎం జగన్ రెడ్డిని . దీని వెనుక ఎవరు ఉన్నారనేది తేలాలని తాను అడుగుతున్నానని ప్రశ్నించారు. వాలంటీర్లు అంటే తనకు ద్వేషం లేదని, ఎంతో అభిమానం కలిగి ఉన్నానని పేర్కొన్నారు. వాలంటీర్ల వ్యవస్థపై కావాలని తాను ఆరోపణలు చేస్తున్నారని మీరు భావిస్తున్నారని ఇదంతా తప్పని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్(Pawan Kalyan).
తాను కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రభుత్వం చేస్తున్న అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తున్నానని ఇది తప్పు ఎలా అవుతుందంటూ మండిపడ్డారు జనసేన పార్టీ చీఫ్.
Also Read : CM YS Jagan : పరిశ్రమల్లో 75 శాతం స్థానికులకే జాబ్స్