Pawan Kalyan : జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన చేపట్టిన వారాహి యాత్ర ఏపీలో కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి స్థిమితంగానే ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. తనను చాలా మంది ప్రతీ దానికి ఆవేశ పడతాడని, ఎక్కువగా గొంతు చించుకుని మాట్లాడతాడంటూ విమర్శలు గుపిస్తున్నారు. కానీ నేను అరిచేది, ఆవేశ పడేది దేని కోసం నా ఆవదేనంతా ప్రజల కోసమన్నారు. ఇవాళ ఏపీలో ఏం జరుగుతోందో ప్రజలకంతా తెలుసు. వాళ్లు గతంలో లేనంతగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన చెందారు.
ఆవేశంగా మాట్లాడటం నాకేం సరదా కాదు. అది కోపం అనుకుంటే పొరపాటు అన్నారు పవన్ కళ్యాణ్(Pawan Kalyan). సాటి మనుషులకు కష్టాలు వస్తే ఎవరూ స్పందించక పోతే తాను ముందుకు వస్తానని స్పష్టం చేశారు. తన హృదయం, గుండె అన్నీ జనం కోసం, జన హితం కోసం పరితపిస్తాయని అన్నారు జనసేన పార్టీ చీఫ్.
అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన ఘనత ఈ వైసీపీ ప్రభుత్వానిది కాదా అని నిలదీశారు పవన్ కళ్యాణ్. తన పోరాటం, ఆరాటం జనం కోసమని మరోసారి స్పష్టం చేశారు.
Also Read : Jawan Teaser : జూలై 7న షారుక్ ఖాన్ జవాన్ టీజర్
