Pawan Kalyan : యువతే కీలకం మీదే భవితవ్యం
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్
Pawan Kalyan : ఏ దేశమైనా ముందుకు వెళ్లాలంటే కావాల్సింది అకుంఠిత దీక్ష కలిగిన యువతేనని పేర్కొన్నారు జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్. వెండి తెరపై ఎందరో హీరోలు ఉన్నారు. వాళ్లను ఆరాధించడం కంటే మీ చుట్టూ ఉన్న సమాజంలో నిజమైన హీరోలు ఎవరో గుర్తించండి. వారి నుంచి స్పూర్తి పొందండి. నిరంతరం కష్టపడితే, ఉన్నత లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుంటే విజయం వరిస్తుందన్నారు పవన్ కళ్యాణ్(Pawan Kalyan).
ప్రపంచం మీ కోసం ఎదురు చూస్తోంది. జనసేనలో యువత కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. పార్టీ భవిష్యత్తు మీపై ఆధారపడి ఉందన్నారు. దేశ పురోగతికి మీ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్(Pawan Kalyan). దేహ ధారుడ్యంతో పాటు గుండె ధైర్యాన్ని కూడా పెంచుకోవాలని అన్నారు. ప్రతి ఓటమిని, పరాజయాన్ని సానుకూలంగా తీసుకోవాలని సూచించారు.
కష్టాలు, కన్నీళ్లు మనుషులకే వస్తాయని వాటిని దాటుకుంటూ గెలుపు సాధించిన వారి జీవితాలను చదవాలని, చూడాలని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్. జీవితంలో ఎదగడానికి పుస్తకాలు కూడా దోహదం చేస్తాయని పేర్కొన్నారు జనసేనాని. ఓటమిని చూసి పారిపోవడం మొదలు పెడితే సమాజం వెంటాడి వేధిస్తుందని అదే ఎదురు తిరిగితే తలవంచుకుని నిలబడుతుందని హితవు పలికారు.
Also Read : తెలంగాణ కంటే గొప్ప రాష్ట్రం చూపండి