Pawan Kalyan : మంగళగిరి – జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. జనసేన, టీడీపీ పొత్తుపై ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. పొత్తు ధర్మానికి తూట్లు పొడిస్తే ఏపీ భవిష్యత్తుకు కూడా తూట్లు పొడిచినట్లేనని భావించాలని అన్నారు. ఇరు పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్.
Pawan Kalyan Shocking Comments
పొత్తుకు సంబంధించిన టీడీపీపై, మన పార్టీపై ఎవరైనా అవాకులు , చెవాకులు పేలితే ఊరుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ప్రధానంగా మన ముందున్న సమస్యలు చాలా ఉన్నాయని ఇరు పార్టీలు కలిసికట్టుగా ఎదుర్కొనేలా ప్రజలను చైతన్యవంతం చేయాలని పిలుపునిచ్చారు.
జనసేన పార్టీ కీలక మీటింగ్ లో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పాల్గొని ప్రసంగించారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. లక్ష కోట్లు ఇప్పటి వరకు దోచుకున్న దొంగ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. కురుక్షేత్రంలో అర్జునుడి లాగా ఊహించు కోవద్దంటూ ఎద్దేవా చేశారు పవన్ కళ్యాణ్.
ఇదిలా ఉండగా ప్రతికూల సమయంలో తనతో పాటు నడిచిన ప్రతి ఒక్కరినీ తాను గుర్తు పెట్టుకుంటానని స్పష్టం చేశారు. తగిన గౌరవం ఇస్తానని అన్నారు. 2019 ఎన్నికల తర్వాత తనతో కలిసి నడుస్తున్న వారిని నేను వదులుకునే ప్రసక్తి లేదన్నారు పవన్ కళ్యాణ్.
Also Read : Minister KTR : తెలంగాణలో హ్యాట్రిక్ పక్కా – కేటీఆర్