Pawan Kalyan : అమిత్ షాతో ప‌వ‌న్ క‌ళ్యాణ్ భేటీ

45 నిమిషాల పాటు సుదీర్ఘ చ‌ర్చ‌

Pawan Kalyan : న్యూఢిల్లీ – కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాతో జ‌న‌సేన పార్టీ చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ భేటీ అయ్యారు. 45 నిమిషాల పాటు ఇద్ద‌రి మ‌ధ్య చ‌ర్చ‌లు కొన‌సాగాయి. భ‌విష్య‌త్తులో బీజేపీ , జ‌న‌సేన పార్టీ క‌లిసి పోటీ చేయ‌డం, ఏపీలో కొలువు తీరిన వైసీపీ జ‌గ‌న్ స‌ర్కార్ ను ఎదుర్కోవ‌డం, సాధ్య‌మైనంత మేర‌కు ఉమ్మ‌డిగా క‌లిసి ముందుకు సాగ‌డం అనే దానిపై చ‌ర్చించిన‌ట్లు స‌మాచారం.

Pawan Kalyan Met Amit Shah

అంత‌కు ముందు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను కేంద్ర మంత్రి తెలంగాణ భార‌తీయ జ‌న‌తా పార్టీ చీఫ్ గంగాపురం కిష‌న్ రెడ్డి, రాజ్య స‌భ సభ్యుడు, మాజీ బీజేపీ చీఫ్ బంగారు ల‌క్ష్మ‌ణ్ ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు ప‌వ‌న్ క‌ళ్యాణ్(Pawan Kalyan) తో. ఈసంద‌ర్బంగా ఇరువురు నేత‌లు ప్ర‌స్తుతం తెలంగాణ‌లో జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌లతో పాటు ఏపీలో వ‌చ్చే ఎన్నిక‌ల గురించి కూడా చ‌ర్చించారు.

ప్ర‌ధానంగా ఎన్నిక‌ల్లో భాగంగా సీట్ల స‌ర్దుబాటు గురించి ఎక్కువ‌గా చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ట్లు టాక్. మ‌రో వైపు ఏపీ స్కిల్ స్కాం కేసులో అడ్డంగా బుక్కై ప్ర‌స్తుతం రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్ర‌బాబు నాయుడుకు సంఘీభావం ప్ర‌క‌టించారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.

టీడీపీ, జ‌న‌సేన క‌లిసి వ‌చ్చే ఎన్నిక‌ల్లో బ‌రిలోకి దిగుతాయ‌ని స్ప‌ష్టం చేశారు. ఇందులో భాగంగా టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ , ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడుతో క‌లిసి కీల‌క స‌మావేశం జ‌రిగింది.

Also Read : Tirumala Hundi : శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 3.30 కోట్లు

Leave A Reply

Your Email Id will not be published!