Pawan Kalyan : పవన్ బాబు భేటీపై ఉత్కంఠ
రాజమండ్రి జైలుకు జనసేనాని
Pawan Kalyan : రాజమండ్రి – జనసేన పార్టీ చీఫ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురువారం రాజమండ్రికి రానున్నారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కీం స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యారు టీడీపీ చీఫ్, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఏపీ ఏసీడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో చంద్రబాబుకు కీలక పాత్ర ఉందని స్పష్టం చేసింది. ఈ మేరకు 25 పేజీల సుదీర్ఘ రిపోర్టును ఏసీబీ కోర్టు జడ్జి హిమ బిందుకు సమర్పించింది.
Pawan Kalyan Will Visit Rajahmundry
ఏపీ ప్రభుత్వం తరపున సుధాకర్ రెడ్డి వాదించారు. చంద్రబాబు నాయుడు తరపున సుప్రీంకోర్టు లాయర్ సిద్దార్థ్ లూథ్రా , వెంకటేశ్వర్ రావు వాదనలు వినిపించారు. ఇదే సమయంలో తనకు కూడా మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు స్వయంగా చంద్రబాబు. ఆయన అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న జడ్జి ఛాన్స్ ఇచ్చింది.
తీవ్ర వాదోపవాదనలు కొనసాగాయి. చివరకు రాత్రి 7 గంటల సమయంల జడ్జి హిమ బిందు సంచలన తీర్పు వెలువరించారు. నారా చంద్రబాబు నాయుడుకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ తీర్పు చెప్పారు. ఈ తీర్పు దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. దీంతో చంద్రబాబు ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. జైలులో ఉన్న బాబును పవన్ కళ్యాణ్(Pawan Kalyan) భేటీ కానున్నారు. ఇప్పటికే సమయం తీసుకున్నారు. వీరిద్దరి భేటీపై ఉత్కంఠ నెలకొంది.
Also Read : K Raghavendra Rao : శ్రీవారి ఆశీస్సులతో బాబు వస్తాడు