Pawan Kalyan : భారీ భద్రత మధ్య పవన్ తరలింపు
మంగళగిరికి చేరుకున్న జనసేన పార్టీ చీఫ్
Pawan Kalyan : మంగళగిరి – జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ ఆదివారం భారీ భద్రత మధ్య మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. తాను ఎట్టి పరిస్థితుల్లో వెళ్లి తీరుతానంటూ అల్టిమేటం జారీ చేశారు . దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.
Pawan Kalyan Reached Mangalagiri
గత్యంతరం లేని పరిస్థితుల్లో జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ను తరలించే ప్రయత్నం చేశారు. కొద్ది సేపు పవన్ తో పాటు నాదెండ్ల మనోహర్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దీంతో జనసేన పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.
ఏపీ సర్కార్ కు, సీఎం జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎలాంటి ఉద్రిక్తత చోటు చేసుకోకుండా పోలీసులు సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. గుంపులుగా ఉన్న జనసేన సైనికులను , వీర మహిళలను చెదరగొట్టారు.
అక్కడి నుంచి భారీ భద్రత మధ్య పవన్ కళ్యాణ్ ను మంగళగిరి లోని జనసేన పార్టీ కార్యాలయం వద్దకు తీసుకు వచ్చారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున తోపులాట చోటు చేసుకుంది. జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలను , శ్రేణులను చెదరగొట్టారు.
ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం దారుణమన్నారు. ఆయన పట్ల రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపించారు. తన అరెస్ట్ ను ఖండిస్తున్నానని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్.
Also Read : Chandrababu Naidu ACB Court : ఏసీబీ కోర్టులో బాబు వాదనలు