Pawan Kalyan : కార్యాచరణపై జనసేనాని కసరత్తు
మనోహర్ తో కలిసి పవన్ సమీక్ష
Pawan Kalyan : మంగళగిరి – ఏపీలో రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, తీసుకోవాల్సిన నిర్ణయాల గురించి ఇప్పటికే ఓ అంచనాకు వచ్చారు జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్. ఓ వైపు సినిమాలలో బిజీగా ఉంటూనే మరో వైపు పార్టీపై ఫోకస్ పెడుతున్నారు.
Pawan Kalyan Janasena Plans
తాజాగా మంగళగిరి ఆఫీసులో సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ తో కలిసి పార్టీ కార్యాచరణకు సంబంధించి సుదీర్ఘంగా చర్చలు జరిపారు. త్వరలో ఎన్నికలు రానుండడంతో టీడీపీతో కలిసి వెళ్లాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్(Pawan Kalyan) రాజమండ్రిలో మీడియాతో ప్రకటించారు.
ఆ తర్వాత షూటింగ్ లో పాల్గొని తిరిగి జనసేన పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఐదో విడత వారాహి యాత్ర, టీడీపీ జనసేన సమన్వయ కమిటీల ఉమ్మడి సమావేశం నిర్వహణపై పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చర్చించారు.
ఇందులో ప్రధానంగా రాష్ట్ర రైతాంగగం ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితులు, సాగునీటి నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యం వల్ల కృష్ణా పశ్చిమ బెల్టాలో 4 లక్షల ఎకరాలు ఎండిపోయిన అంశంపై కూడా చర్చించారు పవన్ కళ్యాణ్.
Also Read : AP CM YS Jagan Tour : 19న ఎమ్మిగనూరుకు జగన్