Pawan Kalyan : ప్ర‌జా ప‌క్షం స‌మ‌స్య‌ల‌పై యుద్దం

జ‌న‌సేన పార్టీ చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్

Pawan Kalyan Speech : అమ‌రుల త్యాగాల‌ను స్పూర్తిగా తీసుకుని తాను జ‌న‌సేన పార్టీని ఏర్పాటు చేశాన‌ని అన్నారు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్. ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న ఇబ్బందుల‌ను తాను త‌ట్టుకోలేక పోయాన‌ని అన్నారు. ధైర్యాన్ని న‌మ్ముకున్నాన‌ని, కోట్లాది మంది జ‌న సైనికుల ఆదరాభిమానాలు త‌న‌ను మ‌రింత ముందుకు వెళ్లేలా చేశాయ‌ని స్ప‌ష్టం చేశారు. తాను ఓట‌మి గురించి ప‌ట్టించుకోన‌ని అన్నారు. ఇవాళ పార్టీ ఆవిర్భావ స‌భ‌ను ల‌క్ష‌లాది మందితో నిండి పోయింద‌న్నారు.

ప్ర‌తి చోటా 500 మందికి పైగా క్రియాశీల‌క స‌భ్యులు క‌లిగి ఉన్నార‌ని అన్నారు. 6 ల‌క్ష‌లకు పైగా కీల‌క స‌భ్యులు ఉన్నార‌ని అన్నారు. తెలంగాణ‌లో సైతం 30 వేల‌కు పైగా క్రియాశీల‌క కార్య‌క‌ర్త‌లు క‌లిగి ఉన్నామ‌ని ఇదంతా మీరే ముఖ్య‌మ‌న్నారు. ప‌దేళ్ల ప్ర‌స్థానంలో మాట‌లు ప‌డ్డాం…కానీ ఎక్క‌డా త‌ల వంచ లేద‌న్నారు. ప్ర‌జ‌ల ప‌క్షాన నిల‌బ‌డ్డామ‌ని , వారి కోసం ఉద్య‌మిస్తున్నాన‌ని చెప్పారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌(Pawan Kalyan Speech).

చ‌ట్టం అంటే ధ‌ర్మాన్ని నిల‌బ‌డట‌మే అన్న నానీ ఫాల్కివాలా అన్న మాట‌లు న‌మ్ముతాన‌ని అన్నారు. ఆనాడు పింగ‌ళి వెంక‌య్య రాష్ట్రం కోసం ప‌డిన త‌ప‌న‌, ఆంధ్ర రాష్ట్ర అవిర్భావంలో పొట్టి శ్రీ‌రాములు బ‌లిదానం ఇప్ప‌టికీ త‌న‌ను ఆలోచింపేలా చేస్తుంద‌న్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్. రెండున్న‌ర ద‌శాబ్దాలుగా తాను జ‌న‌సేన పార్టీని ఏర్పాటు చేశాన‌ని చెప్పారు.

జ‌న‌సేన ఉన్న‌ది స‌మాజంలో ప‌రివ‌ర్త‌న తీసుకు రావ‌డ‌మేన‌ని అన్నారు. ప్ర‌తి ఓట‌మి గుణ పాఠం నేర్పుతుంద‌న్నారు. గెలుపు ఓట‌ముల‌ను స‌మానంగా చూస్తాన‌ని చెప్పారు. కులాలు అంత‌ర్భాగంగా ఉన్నాయ‌ని క‌లిసి క‌ట్టుగా ముందుకు సాగాల‌ని పిలుపునిచ్చారు.

Also Read : అంద‌రి చూపు జ‌న‌సేన వైపు

Leave A Reply

Your Email Id will not be published!