Pawan Kalyan : బీజేపీతో జనసేన పొత్తు – పవన్ కళ్యాణ్
ఇక తేల్చుకోవాల్సింది టీడీపీనే
Pawan Kalyan : జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ పొత్తులపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు. నిన్నటి దాకా ఎలాంటి ప్రకటన చేయని పవర్ స్టార్ ఢిల్లీ వేదికగా జాతీయ మీడియాతో మాట్లాడుతూ కుండ బద్దలు కొట్టారు. రాబోయే ఎన్నికల్లో తాము ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటామనే విషయాన్ని స్పష్టం చేశారు. దీంతో జన సైనికులకు కూడా ఓ అవగాహన వచ్చింది. రాష్ట్ర భవిష్యత్తు కోసం పొత్తు పెట్టుకోవడం అనేది అత్యంత అవసరమని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్.
Pawan Kalyan Clarification
ఆయన గత కొన్ని రోజులుగా ఏపీలో వారాహి విజయ యాత్ర చేపడుతున్నారు. ఏపీ సర్కార్ ను కడిగి పారేస్తున్నారు. ఇదిలా ఉండగా కేంద్రంలోని మోదీ , బీజేపీ సంకీర్ణ సర్కార్ తమ పార్టీలతో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ కీలక భేటీకి జనసేన(Janasena) పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ ను కూడా పిలిచింది. ఈ మేరకు పవన్ కళ్యాణ్ హాజరయ్యారు.
2024లో జరిగే శాసనసభ ఎన్నికలు కీలకమైనవని అన్నారు . తాము భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంటామని, ఇక తెలుగుదేశం పార్టీ తమతో కలిసి వస్తుందో రాదో వారే నిర్ణయించు కోవాలంటూ ఆ పార్టీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడికి షాక్ ఇచ్చారు. ఈ విషయంపై ఇంకా నోరు మెదపలేదు టీడీపీ చీఫ్.
Also Read : Nelson Mandela Comment : మండేలా మానవతా పతాక