Pawan Kalyan : ప్ర‌జా సంక్షేమం జ‌న సేన ల‌క్ష్యం

జ‌న‌సేనాని ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్

Pawan Kalyan : ఏపీలో రాచ‌రిక పాల‌న సాగుతోంది. ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అన్ని వ‌ర్గాల వారు ఆందోళ‌న చెందుతున్నారు. పాల‌న అస్త‌వ్య‌స్తంగా మారింది. భ‌య పెట్ట‌డం, ఆందోళ‌న క‌లిగించేలా దాడుల‌కు దిగ‌డం ష‌రా మామూలై పోయింది. ఇలాంటి పాల‌న‌ను ప్ర‌జ‌లు కోరుకోలేద‌న్నారు జ‌న‌సేన పార్టీ చీఫ్ ,ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్.

ఆయ‌న చేప‌ట్టిన వారాహి విజ‌య యాత్ర ప్ర‌స్తుతం కోన‌సీమ‌లో కొన‌సాగుతోంది. ఈ సంద‌ర్భంగా భారీ ఎత్తున జ‌నం హాజ‌ర‌య్యారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు బ్ర‌హ్మ ర‌థం ప‌ట్టారు. అంత‌కు ముందు యానాంలో భారీ రోడ్ షో చేప‌ట్టారు. ముమ్మ‌డివ‌రంకు చేరుకున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ నిప్పులు చెరిగారు ఏపీ స‌ర్కార్ పై. ఇప్ప‌టి దాకా ఏపీకి ఏం తీసుకు వ‌చ్చారో, ఏం చేశారో చెప్పాల‌ని అన్నారు.

ఈ రాష్ట్రానికి ఎన్ని ప‌రిశ్ర‌మ‌లు తీసుకు వ‌చ్చారో శ్వేత‌ప‌త్రం విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేశారు ప‌వ‌న్ క‌ళ్యాణ్(Pawan Kalyan). ముస్లింల‌కు , మ‌సీదుల‌కు తాను వ్య‌క్తిగ‌తంగా ఆర్థిక సాయం చేశాన‌ని చెప్పారు. తాను ఒక్క‌డినే రూ. 25 ల‌క్ష‌లు సాయం చేయ‌గ‌లిగిన‌ప్పుడు అదే పార్టీ ప‌వ‌ర్ లోకి వ‌స్తే ఇంకెంత చేయ‌గ‌ల‌నో ఆలోచించు కోవాల‌ని అన్నారు జ‌న‌సేనాని.

జ‌న సైనికుల‌పై కావాల‌ని వైసీపీ నాయ‌కులు దాడుల‌కు పాల్ప‌డుతున్నార‌ని, ఇంకోసారి త‌మ వారి జోలికి వ‌స్తే తాట తీస్తాన‌ని హెచ్చ‌రించారు ప‌వ‌న్ క‌ళ్యాణ్. ప్ర‌భంజ‌నం మొద‌లైంద‌ని ఇక మిగిలింది యుద్ద‌మేన‌ని అన్నారు.

Also Read : Shiva Raj Kumar DK : డీకేతో శివ‌రాజ్ కుమార్ ముచ్చ‌ట‌

 

Leave A Reply

Your Email Id will not be published!