Pawan Kalyan : ఉప్పాడను సిల్క్ సిటీగా మారుస్తాం
జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్
Pawan Kalyan : ఉప్పాడ ప్రాంతాన్ని సిల్క్ సిటీగా మారుస్తామని అన్నారు జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ . ఏపీలో వారాహి యాత్ర సందర్భంగా పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులను పరామర్శించారు. పట్టు తీసిన చేతులను మోసం చేసిన ఘనత ఏపీ సీఎం జగన్ రెడ్డికే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో మార్పు ఖాయమని, ప్రజలు కొత్త పాలనను కోరుకుంటున్నారని చెప్పారు పవన్ కళ్యాణ్.
ఉప్పాడ ప్రాంతానికి సరైన గుర్తింపు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతాన్ని అన్ని రంగాలలో అభివృద్ది చేసేందుకు తాను కృషి చేస్తానని చెప్పారు. చేనేత ముడి సరకుపై రాయితీ ఇస్తామని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్(Pawan Kalyan).
పట్టు రైతులకు గిట్టుబాటు ధర అందేలా చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ చీఫ్ డిమాండ్ చేశారు. మూడున్నర ఏళ్లలో ముచ్చటైన ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దుతామని జోష్యం చెప్పారు. జనసేన సర్కార్ వస్తుందని అన్ని వర్గాలకు తగు ప్రాధాన్యత ఇస్తామని అన్నారు పవన్ కళ్యాణ్. ఇదిలా ఉండగా వారాహి యాత్ర సందర్భంగా చేబ్రోలులో పట్టు రైతులు, చేనేత కళాకారుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు జనసేన పార్టీ చీఫ్.
Also Read : Jigna Vora Comment : ధీర వనిత జిగ్నా వోరా