Pawan Kalyan : జాగా కనిపిస్తే జగన్ వాలిపోతాడు
జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్
Pawan Kalyan : రాష్ట్రంలో ఏ భూములను వదలడం లేదు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఆయన అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందన్నారు జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్. సిరిపురంలో వివాదాస్పద సీబీఎసీఎన్సీ భూములను ఆదివారం ఆయన పరిశీలించారు నాదెండ్ల మనోహర్ తో కలిసి. భారీ ఎత్తున జనం అక్కడికి వచ్చారు. భూముల పరిశీలన అనంతరం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మీడియాతో మాట్లాడారు. జగన్ పై నిప్పులు చెరిగారు.
Pawan Kalyan Slams YS Jagan
ఏపీ సీఎం అక్రమాలకు అంతే లేకుండా పోయిందన్నారు. ఆయనకు ఏ మతంతోనూ సంబంధం లేదన్నారు. ఏ మతానికి చెందిన భూములైనా అవి తనకు అక్కరకు వస్తాయని అనుకుంటే వెంటనే వాలి పోతాడని లేక పోతే తన టీమ్ ను పంపిస్తాడని ఆరోపించారు పవన్ కళ్యాణ్.
నయానో భయానో ఒప్పించడం, ధర చెల్లించడం లేక పోతే కబ్జాకు పాల్పడడం ఇదే ఇప్పుడు ఏపీలో జగన్ అనుసరిస్తున్న నయా ట్రెండ్ అని ఎద్దేవా చేశారు. జాగా కనిపించడమే తరువాయి ఇక జగన్ అండ్ కో వాలి పోతుందన్నారు. గెలిపించిన జనాన్ని వదిలేసి పారిపోతాను అనేందుకు సిగ్గు ఉండాలన్నారు విశాఖ ఎంపీని ఉద్దేశించింది పవన్ కళ్యాణ్. వైసీపీ అక్రమాలకు ఏ వాస్తు సహకరించదన్నారు. ఉత్తరాంధ్ర దోపిడీపై విద్యార్థి లోకం తిరగబడాలని పిలుపునిచ్చారు.
Also Read : RGV Slams : బండారూ నీ బండారం బయట పెడతా