Pawan Kalyan : సంక్షేమం బక్వాస్ కల్తీ మద్యం జోష్
నిప్పులు చెరిగిన జనసేన పార్టీచీఫ్
Pawan Kalyan : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కార్ పై మరోసారి ధ్వజమెత్తారు జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో తాను అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్య నిషేధం విధిస్తానని ప్రకటించారని కానీ మాట తప్పాడంటూ మండిపడ్డారు. ఇప్పుడు రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని ఆరోపించారు. చివరకు కల్తీ మద్యంతో వ్యాపారం చేస్తుండడం బాధాకరమన్నారు. కేవలం ఈ ఒక్క ఏడాది 2023-24లో ఏకంగా రూ. 33 వేల కోట్ల మద్యం అమ్మాలని నిర్ణయించడం దారుణమన్నారు పవన్ కళ్యాణ్.
గత ఐదేళ్ల కాలంలో ఏపీలో రూ. 1,27,248 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయని దీని వల్ల ఎవరు లాభ పడ్డారో ఏపీ సీఎం జగన్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు జనసేన పార్టీ చీఫ్. 2018 -19తో పోలిస్తే ఈ ఏడాది లో ఎక్సైజ్ పన్ను రూపంలో 189 శాతం ప్రభుత్వ ఆదాయం పెరగనుందని అన్నారు పవన్ కళ్యాణ్(Pawan Kalyan). రాష్ట్రంలో ప్రజలను మద్యానికి బానిసలుగా మార్చేసిన ఘనత జగన్ రెడ్డికి దక్కుతుందని ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని, రాచరికం రాజ్యం ఏలుతోందని ఆరోపించారు. సీఎం అండతో మంత్రులు, ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు దౌర్జన్యాలు, అక్రమాలు, అవినీతికి పాల్పడుతున్నారంటూ ధ్మజమెత్తారు పవన్ కళ్యాణ్.
Also Read : RBI RS 2000 Notes : 76 శాతం రూ. 2000 నోట్లు వెనక్కి
